Ishan Kishan : ఇషాన్ కిషన్ అలకకు అతడే కారణమా? అందుకనే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాడా?
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
- Thota Vamshi Kumar
- Updated on- February 8, 2024 / 05:17 PM IST
Ishan Kishan
Ishan Kishan – Jitesh Sharma : భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచులకు భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో అతడి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలు అయ్యాయి. తొలి రెండు టెస్టుల్లో కేఎస్ భరత్ విఫలం కావడంతో ఇషాన్ ను తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇషాన్ ను ఎంపిక చేయడం కష్టమేనని తెలుస్తోంది.
ఇషాన్ కిషన్ ఆటకు దూరమై దాదాపు మూడు నెలలు కావొస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చేశాడు. అతడు అలా రావడానికి గల కారణం ఇంత వరకు ఎవ్వరికి తెలియదు. కాగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జితేశ్ శర్మను ఎంపిక చేయడం ఇషాన్ ను బాధించిందట. ఎలాగో తుది జట్టులో అవకాశం రావడం లేదు. బెంచీ మీద ఉండడం ఇష్టం లేక అతడు భారత్ వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాడట.
Team India : మూడో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. ఇక ఇంగ్లాండ్ పని ఈజీనే!
ఈ క్రమంలోనే తనకు ఆట నుంచి కొన్ని రోజులు విరామం కావాలని అతడు జట్టు మేనేజ్‌మెంట్ ను కోరిన అనంతరం భారత్‌కు తిరిగి వచ్చేశాడని పలురిపోర్టులు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ఇటు ఇషాన్ గానీ అటు మేనేజ్‌మెంట్ గానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.
ప్రాక్టీస్ మొదలెట్టాడు..
ఇషాన్ కిషన్ రెండు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. బరోడాలోని కిరణ్ మోరె అకాడమీలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్, కృనాల్ పాండ్యలతో కలిసి ఇషాన్ శిక్షణ పొందుతున్నాడు. ఐపీఎల్‌తోనే అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఉండడంతో ప్రస్తుతం అతడు టీ20లపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా అర్ధమవుతోంది. మరీ ఐపీఎల్‌లో అతడు సత్తా చాటితే టీమ్ఇండియాలో చోటు లభిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.
MS Dhoni : ధోని బ్యాట్ పైనే అందరి కళ్లూ.. కోట్లు వద్దుకుని, స్నేహితుడి కోసం..
