MS Dhoni : ధోని బ్యాట్ పైనే అంద‌రి క‌ళ్లూ.. కోట్లు వ‌ద్దుకుని, స్నేహితుడి కోసం..

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని కెరీర్ ప్ర‌స్తుతం చ‌ర‌మాంకంలో ఉంది.

MS Dhoni : ధోని బ్యాట్ పైనే అంద‌రి క‌ళ్లూ.. కోట్లు వ‌ద్దుకుని, స్నేహితుడి కోసం..

MS Dhoni

MS Dhoni bat : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని కెరీర్ ప్ర‌స్తుతం చ‌ర‌మాంకంలో ఉంది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన మ‌హేంద్రుడు ప్ర‌స్తుతం ఐపీఎల్ లో మాత్ర‌మే ఆడుతున్నాడు. మ‌హీ కెరీర్‌లో ఐపీఎల్ 2024 సీజ‌నే చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీజ‌న్‌కు మ‌రో నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ఇప్ప‌టికే ధోని ప్రాక్టీస్‌ను మొద‌లెట్టేశాడు. కాగా.. ధోని ప్రాక్టీస్‌కు చేస్తున్న వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఈ వీడియోల్లో ధోని ఓ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయ‌డం క‌నిపించింది. ఆ ఏముంది ఏదైన పెద్ద కంపెనీ ధోనితో ఒప్పందం కుద‌ర్చుకుని ఉంటుంది. అందుక‌నే మ‌హేంద్రుడు ఆ కంపెనీ లోగోను త‌న బ్యాట్ పై వాడుతున్నాడు అని మీరు అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. ఆ లోగో ఏ పెద్ద కంపెనీకి చెందిన కాదు.. ధోని చిన్న‌నాటి స్నేహితుడికి చెందిన షాపు పేరు ఉన్న స్టిక్క‌ర్ అది. త‌న స్నేహితుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోని అత‌డి షాపు పేరుతో ఉన్న స్టిక్క‌ర్ అంటించి ప్రాక్టీస్ చేశాడు.

Team India : మూడో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. ఇక ఇంగ్లాండ్ ప‌ని ఈజీనే!

ధోని చిన్న‌నాటి స్నేహితుడి పేరు పరమ్‌జీత్ సింగ్. అత‌డికి ప్రైమ్ స్పోర్ట్స్ అనే ఓ షాపు ఉంది. ఇందులో క్రికెట్ కిట్‌ల‌తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట వ‌స్తువులు ల‌భిస్తాయి. అత‌డి షాపుకి మ‌రింత పేరు తేవ‌డం కోసం ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్క‌ర్ ఉన్న బ్యాటుతో ధోని ప్రాక్టీస్ చేశాడు. కాగా.. ధోని పై రూపొందించిన బ‌యోపిక్‌లోనూ ప‌ర‌మ్‌జీత్ సింగ్ గురించి చూపించారు. ధోని త‌న కెరీర్ ఆరంభంలో మొద‌టి బ్యాట్ స్పాన్స‌ర్‌ని పొంద‌డంలో ప‌ర‌మ్‌జీత్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు.

చివ‌రి ఐపీఎల్‌!

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) విజేత‌గా నిలిచింది. ధోని సార‌థ్యంలో చెన్నై ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజ‌న్ మొత్తం మోకాలి గాయంతోనే అత‌డు ఆడాడు. సీజ‌న్ ముగిసిన వెంట‌నే మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. ప్ర‌స్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ కోసం ఇటీవ‌లే ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. కాగా.. ధోనికి ఇదే సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, స్వ‌యంగా దీనిపై ధోనినే స‌మాధానం ఇస్తాడ‌ని ఇప్ప‌టికే సీఎస్‌కే సీఈఓ విశ్వనాథ‌న్ తెలిపిన సంగ‌తి తెలిసిందే.

WTC Points table : టీమ్ఇండియా కొంప‌ముంచిన ద‌క్షిణాఫ్రికా నిర్ణ‌యం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి..

ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం ఆరుగురు ఆట‌గాళ్ల‌ను చెన్నై కొనుగోలు చేసింది. ఇందులో న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్ ను అత్య‌ధికంగా రూ.14 కోట్ల‌ను వెచ్చించి సొంతం చేసుకుంది. అంతేకాకుండా అన్‌క్యాప్‌డ్ ఆట‌గాడైన స‌మీర్ రిజ్వీని రూ.8.4కోట్ల‌కు కొనుగోలు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.