Devdutt Padikkal : అరె బాబు.. ఈ గోల్డ్ చైన్ నీదేనా? ఆర్‌సీబీ ప్లేయర్ నిజాయతీకి ఫ్యాన్స్ ఫిదా.. పిచ్ పై బంగారం దొరకగానే..
వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ (Devdutt Padikkal) పిచ్ పై బంగారు గొలుసు పడి ఉండడాన్ని గమనించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 14, 2026 / 10:31 AM IST
Jacob Bethell dropped his gold chain while losing his wicket during the match against KKR
- పిచ్ పై పడిపోయిన గోల్డ్ చైన్
- గమనించుకోకుండా పెవిలియన్‌కు వెళ్లిన జాకెబ్ బెథెల్
Devdutt Padikkal : రాయ్‌పూర్ వేదికగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్‌సీబీ స్టార్ ఓపెనర్ జాకబ్ బెథెల్ తాను ఔట్ అయిన సమయంలో అతడి బంగారు గొలుసు పిచ్ పై పడింది. దాన్ని అతడు గమనించకుండానే డగౌట్‌కు వెళ్లిపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ పిచ్ పై బంగారు గొలుసు పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే దాన్ని చేతిలో తీసి అంపైర్లకు అందజేశాడు. వారు దానిని బెథెల్‌కు అందించారు.
అలా ఎలా గొలుసు పడిపోయిందంటే.?
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను కేకేఆర్ బౌలర్ కార్తిక్ త్యాగి వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని షార్ట్‌బాల్‌గా సందించాడు. పుల్ షాట్ ఆడడంలో బెథెల్ విపలం కాగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి అతడి హెల్మెట్‌ను తాకింది. ఆ దెబ్బకు బెథెల్ మెడలోని గొలుసు ఊడిపోయి కిందపడిపోయింది. హెల్మెట్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంతో బెథెల్ ఔట్ అయ్యాడు.
తాను ఔట్ అయ్యానన్న నిరాశలో గొలుసు పడిపోయిన విషయాన్ని బెథెల్ గమనించలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజుకు వద్దకు చేరుకోగా పిచ్ పై పడి ఉన్న గొలుసును గమనించి అంపైర్లకు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా పడిక్కల్ నిజాయతీని అందరూ పొగుడుతూ ఉన్నారు.
Wicket girte hi sabki nazar catch par thi…
Par Jacob Bethell apni gold chain pitch par gira kar chale gaye 😭⛓️
Phir entry hui Devdutt Padikkal ki…
Bhai batting se pehle pitch inspection nahi, chain inspection karne lage 😂🏏🔥#RCBvsKKR #JacobBethell pic.twitter.com/ByBJlmRLsG— Pramod sahu (@PramodK08555177) May 13, 2026
