Rajat Patidar : ఆ విషయం నాకు తెలుసు.. జట్టులో మార్పులు తప్పవు.. రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్లు..
కేకేఆర్ పై విజయం అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) మాట్లాడుతూ ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
IPL 2026 Rajat Patidar intresting comments after RCB vs KKR match (pic credit@ipl)
- కేకేఆర్ పై విజయం
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్లు
- జట్టులో మార్పులు ఉంటాయని వెల్లడి
Rajat Patidar : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ పై విజయం సాధించి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ పై విజయం అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నప్పటికి కూడా తాము అతివిశ్వాసానికి పోమన్నాడు. తదుపరి మ్యాచ్‌పై మాత్రమే తమ దృష్టి ఉందన్నాడు. ఇక ప్రతి మ్యాచ్‌లో ఒక్కొక్కరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండడం చాలా బాగుందన్నాడు.
తొలి 10 ఓవర్లలో ప్రత్యర్థి జట్టు ఓవర్‌కు 10 నుంచి 11 రన్‌రేటుతో పరుగులు చేసింది. ఆ తరువాత వారిని మా బౌలర్లు అడ్డుకున్నతీరు బాగుంది. వారిని 194 పరుగులకే కట్టడి చేశాము. ఇది మాకు ఓ మంచి సంకేతం. అని పాటిదార్ చెప్పాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఇదే కాంబినేషన్‌తో ఆడతారా? అనే ప్రశ్న ఎదురుకాగా.. కాదని సమాధానం చెప్పాడు. పిచ్ పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు ఉంటాయన్నాడు.
ఈ పిచ్ రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకనే మేం నలుగురు పేసర్లతో బరిలోకి దిగాం.. అది కలిసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి గురించి వర్ణించేందుకు తన వద్ద మాటలు లేవన్నాడు. మైదానంలో అతడు ఇలా చేయడం కొత్తేమీ కాదన్నాడు.
Ajinkya Rahane : ఆ ఒక్క తప్పే మా కొంపముంచింది.. కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కీలక వ్యాఖ్యలు..
లీగ్ దశలో తాము ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. ధర్మశాల, హైదరాబాద్ వేదికగా ఆయా ఆయా మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపాడు. ఆ రెండు వేదికల్లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామం అనే విషయం తమకు తెలుసునని చెప్పుకొచ్చాడు. ఇదే జోష్‌ను అక్కడా కొనసాగిస్తామని తెలిపాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతి పాటిదార్ తలకు తగిలింది. దీనిపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను బాగున్నానని చెప్పుకొచ్చాడు. అది సరిగ్గా తలకు తగిలిందని చెప్పాడు.
