Kolkata Knight Riders : వార్నీ కోల్‌కతాకు ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్సుందా? అదే జరిగితే సన్‌రైజర్స్ కొంప కొల్లేరేనా?
ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఓడిపోయింది.
Kolkata Knight Riders have still chance to qualify ipl 2026 playoffs after lost match to rcb (pic credit@ipl)
- ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన కేకేఆర్
- ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు సంక్లిష్టం
Kolkata Knight Riders : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇది ఆరో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
కేకేఆర్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేటు -0.198గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.
కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే?
కేకేఆర్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చాలా సమీకరణాలు కలిసి రావాల్సి ఉంది. ముందుగా ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌లు.. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంటి ముఖం పట్టాల్సిందే.
Ajinkya Rahane : ఆ ఒక్క తప్పే మా కొంపముంచింది.. కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కీలక వ్యాఖ్యలు..
మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు వచ్చి చేరతాయి. అయినప్పటికి కూడా ఇతర జట్ల ఫలితాలపైనే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
తమకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలవకూడదు. అప్పుడు నెట్‌రన్‌రేటు ఆధారంగా కేకేఆర్‌కు ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పంజాబ్ మిగిలిన మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే వారు నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తారు. ఇంకో మార్గం ఏంటంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తాము ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు కేకేఆర్‌కు ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో సీఎస్కే, రాజస్థాన్‌లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.
ఇక్కడ కోల్‌కతాకు గట్టి నమ్మకం ఏంటి అంటే.. తాము ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్‌లు సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్‌లోనే ఆడనుంది. సొంత గడ్డపై కేకేఆర్‌కు మంచి రికార్డు ఉంది.
