MS Dhoni – Jadeja: మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశిస్తూ జడేజా ఆసక్తికర ట్వీట్.. ఫ్యాన్స్ ఖుషీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం అనంతరం చోటుచేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ రవీంద్ర జడేజా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశాడు.
- Harish Thanniru
- Updated on- May 30, 2023 / 01:47 PM IST
Ravindrasinh jadeja
Ravindrasinh jadeja: ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు అదరగొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం తరువాత సీఎస్కే జట్టు సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు. ఎంతటి విజయమైన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోనీ తొలిసారి తన ఆనందాన్ని ఆపుకోలేక పోయాడు.
IPL 2023 Records : ఐపీఎల్ 2023లో రికార్డులే రికార్డులు.. ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు ఎవరు కొట్టారంటే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి రెండు బాల్స్‌లో 10 రన్స్ కొట్టాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో చెన్నై జట్టు ఓడిపోతుందని అందరూ భావించారు. ధోనీ సైతం ఆ సమయంలో నిరాశగా కనిపించాడు. కానీ.. క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా రెండు బాల్స్‌కు వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ధోనీ తన ఆనందాన్ని ఆపుకోలేక పోయారు. రవీంద్ర జడేజాను అమాంతం తన భుజాలపైకి ఎత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ భావోద్వేగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CSK Victory Celebrations: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ సెలెబ్రేషన్స్ అదుర్స్.. ఫొటో గ్యాలరీ
తాజాగా, ‘సోమవారం రాత్రి జట్టు విజయం అనంతరం చోటుచేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ తన అధికారిక ట్విటర్ ఖాతాలో రవీంద్ర జడేజా ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న ఫొటోలతో పోస్టు పెట్టాడు. ‘ఇది కేవలం ఎంఎస్ ధోనీకోసం మాత్రమే చేశాం.. మహీ భాయ్ నీ కోసమే ఏదైనా’ అని ఆ ట్వీట్ లో రాశారు. జడేజా ట్వీట్ చూసిన మహేంద్ర ధోనీ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ జడేజా, ధోనీ స్నేహాన్ని ప్రశంసిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.
