IPL 2023 Records : ఐపీఎల్ 2023లో రికార్డులే రికార్డులు.. ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు ఎవరు కొట్టారంటే..

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..

IPL 2023 Records : ఐపీఎల్ 2023లో రికార్డులే రికార్డులు.. ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు ఎవరు కొట్టారంటే..

IPL 2023 Records – Most Centuries : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్ విజయవంతంగా ముగిసింది. ఐపీఎల్ 16వ ఎడిషన్ క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించింది. మొత్తంగా చూస్తే వర్షం కారణంగా రద్దయిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచ్ లు సవ్యంగానే సాగాయి. ఫైనల్ మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా జరిగింది. ఫైనల్ మ్యాచ్ (IPL Final) ఫలితం తేలడానికి అర్ధరాత్రి దాటినా కూడా అభిమానులు మైదానంలోనే వేచివున్నారు. వీక్షకులు కూడా మ్యాచ్ చివరి వరకు వెయిట్ చేశారు.

shubman gill

శుభ్‌మన్ గిల్‌ (photo @gujarat_titans)

అత్యధికంగా 12 సెంచరీలు
ఐపీఎల్ 2023లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ సీజన్ లో అత్యధికంగా 12 సెంచరీలు నమోదు కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) మూడు సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ సొంతం సాధించాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) 2 సెంచరీలు చేశాడు. యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కెమరాన్ గ్రీన్, హెన్రిచ్ క్లాసెన్, వెంకటేశ్ అయ్యర్, సిమ్రాన్ సింగ్, హారీ బ్రూక్.. సెంచరీలతో మెరిశారు. గిల్ 890 పరుగులతో టాపర్ గా నిలిచాడు. డూప్లెసిస్ (730), డెవన్ కాన్వే(672), విరాట్ కోహ్లి(639), యశస్వి జైశ్వాల్(625) టాప్-5లో ఉన్నారు. మొత్తం 141 అర్ధ సెంచరీలు వచ్చాయి.

CSKvsGT

photo: @gujarat_titans

37 సార్లు 200 ప్లస్ స్కోర్లు
ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. 37 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు కావడం విశేషం. గత సీజన్ లో 200 అంతకంటే ఎక్కువ పరుగులు వచ్చిన స్కోర్లు 18 పర్యాయాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 16 ఐపీఎల్ ఫైనల్స్ లో 6 సార్లు 200, అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ ఫైనల్స్ లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఆలౌట్ కాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు టైటిల్ నెగ్గగా, ఛేజింగ్ చేసిన టీమ్ లు 7 సార్లు విజేతగా నిలిచాయి.

Also Read: సీఎస్‌కే విజయం తరువాత జడేజా భార్య ఏం చేసిందో తెలుసా? భావోద్వేగానికి గురైన జడేజా.. వీడియో వైరల్

1124 సిక్సర్లు, 2174 ఫోర్లు
ఈ మెగాటోర్నిలో అత్యధికంగా 1124 సిక్సర్లు, 2174 ఫోర్లు వచ్చాయి. అత్యధిక సిక్సర్ల జాబితాలో డూప్లెసిస్ ముందున్నాడు. డూప్లెసిస్ 36, శివం దూబె 35, గిల్ 33, మ్యాక్స్ వెల్ 31, రుతురాజ్ గైక్వాడ్ 30 సిక్సర్లు బాదారు. గిల్ అందరికంటే ఎక్కువగా 85 ఫోర్లు కొట్టాడు. యశస్వి (82), కాన్వే(77), వార్నర్ (69) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గత ఏడాది జోస్ బట్లర్ 45 సిక్సర్లు, 83 ఫోర్లతో టాపర్ గా నిలిచాడు.

Orange cap, purple cap

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు అందుకుంటూ.. (photo @gujarat_titans)

రెండు టోపీలు ఆ జట్లకే
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు రెండూ గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లకే దక్కాయి. 28 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. గత సీజన్ లోనూ రన్నరప్ గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్లేయర్సే ఆరెంజ్, పర్పుల్ క్యాప్ దక్కించుకోవడం మరో విశేషం. ఐపీఎల్ 2022లో జోస్ బట్లర్ (863 పరుగులు).. ఆరెంజ్ క్యాప్ అందుకోగా, యజువేంద్ర చహల్ (27 వికెట్లు) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

Also Read: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. సీఎస్‌కే ఫ్యాన్స్ ఖుషీఖుషీ

జీటీకి ఫేయిర్ ప్లే అవార్డు
ఫేయిర్ ప్లే అవార్డు గుజరాత్ టైటాన్స్ జట్టుకు దక్కింది. గత సీజన్ తో పాటు 2021లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫేయిర్ ప్లే అవార్డు అందుకుంది. 2020, 2018లో ముంబై ఇండియన్స్ టీమ్ కు ఈ అవార్డు దక్కింది.
2019లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో గుజరాత్ లయన్స్ ఫేయిర్ ప్లే అవార్డు అందుకున్నాయి.