Ravindra Jadeja: సీఎస్‌కే విజయం తరువాత జడేజా భార్య ఏం చేసిందో తెలుసా? భావోద్వేగానికి గురైన జడేజా.. వీడియో వైరల్
రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి జట్టును గెలిపించడంతో.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అతని భార్య రివాబా జడేజా భావోద్వేగానికి గురైంది.

Ravendar Jadeja
IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు అదరగొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక భూమిక పోషించారు.

Jadeja Wife Rivaba
IPL 2023 Final: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. చెన్నై ఫ్యాన్స్ ఖుషీఖుషీ
వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం.. మ్యాచ్‌ను 15ఓవర్లకు కుదించారు. చెన్నై సూపర్ కింగ్స్ 171 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి ఓవర్‌లో సీఎస్‌కే జట్టు 13 పరుగులు చేయాల్సి వచ్చింది. గుజరాత్ బౌలర్ మోహిత్ బౌలింగ్ వేశాడు. తొలి నాలుగు బంతులకు మోహిత్ ఇచ్చిన పరుగులు కేవలం మూడే. రెండు బాల్స్‌కు పది పరుగులు చేయాలి. చెన్నై ఓటమి ఖాయమనుకున్నారు. కానీ, క్రీజులో ఉంది రవీంద్ర జడేజా. ఐదో బంతికి సిక్స్ కొట్టి చెన్నై జట్టులో ఆశలు రేకెత్తించాడు. ఒక్క బాల్.. నాలుగు పరుగులు కావాల్సి ఉంది. చివరి బాల్‌కు జడేజా ఫోర్ కొట్టడంతో స్టేడియం మొత్తం పసుపు మయంగా మారిపోయింది.
జడేజా ఫోర్ కొట్టి జట్టును గెలిపించడంతో.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అతని భార్య రివాబా జడేజా భావోద్వేగానికి గురైంది. కంటి నుంచి కారుతున్న ఆనంద భాష్పాలను తుడుకుంటూ కనిపించింది. కొద్దిసేపటికి రివాబా గ్రౌండ్‌లోకి రావడంతో జడేజా ఆమెను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు. రివాబా చిరునవ్వులు చిందిస్తూ జడేజాను హత్తుకుంది. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.
CSK ? ko champion ? banane wale Sir ravindra jadeja with his wife #IPL2023Finals #RavindraJadeja pic.twitter.com/MPVgaAPh5c
— Keshav Nagar (@keshavnagarncc) May 29, 2023
— Nihari Korma (@NihariVsKorma) May 29, 2023