IPL 2023 Final: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. సీఎస్‌కే ఫ్యాన్స్ ఖుషీఖుషీ

చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆ జట్టు ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు.

IPL 2023 Final: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. సీఎస్‌కే ఫ్యాన్స్ ఖుషీఖుషీ

MS Dhoni and Jadeja

MS Dhoni – Jadeja: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు అద‌ర‌గొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో చివరి బాల్‌కు జడేజా ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

IPL 2023 Prize Money: ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఎంత ఫ్రైజ్‌మనీ వచ్చింది.. ఏ ప్లేయర్‌కు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

జట్టు విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు. సీఎస్‌కే టీం సభ్యులతో పాటు స్టేడియంలోని సీఎస్‌కే జట్టు అభిమానుల కేరింతలు, డ్యాన్స్‌లతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. జట్టు విజయం అనంతరం జడేజాను ధోనీ భుజాలపైకి ఎత్తుకున్న వీడియోను ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఖుషీఖుషీ అవుతున్నారు.

IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్ జట్టు 214 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం రావడంతో డెక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం 15 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. దీంతో చెన్నై జట్టు లక్ష్యం 171 పరుగులుగా నిర్దేశించారు. చెన్నై జట్టులో రుత్వాజ్ గైక్వాడ్ 26, డెవాన్ కాన్వే 47, శివమ్ దూబే 32 (నాటౌట్), అజింక్య రహానే 27, అంబటి రాయుడు 19, ఎం.ఎస్. ధోనీ (0) డక్‌ఔట్, జడేజా 15 పరుగులు (నాటౌట్) చేశారు.