Jaskaran Malhotra: ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన రెండో క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు అమెరికాకు చెందిన జస్కరన్ మల్హోత్రా. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో...

Jaskaran Malhotra: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు అమెరికాకు చెందిన జస్కరన్ మల్హోత్రా. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. సెప్టెంబర్ 2019లో అమెరికా గడ్డపై తొలి వన్డే సిరీస్ జరగ్గా ఇది రెండోది.

పపువా న్యూ గినియా మీడియం పేసర్ గౌడీ టోకా వేసిన ఓవర్ మొత్తంలో ఆరు బంతులకు సిక్సులు సమర్పించుకున్నాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లాంగాన్, ఎక్స్‌ట్రా కవర్, లాంగాఫ్ వైపుగా బాది రికార్డు నెలకొల్పాడు. చివరి ఓవర్‌ వరకూ 50వ ఓవర్లో 173పరుగులు పూర్తి చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచి వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మోర్గాన్‌ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా… అంతర్జాతీయ టీ20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.

ఈ ఫీట్ తో డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ చేశాడు మల్హోత్రా.. ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. పపువా న్యూ గినియా 137పరుగులకు ఇన్నింగ్స్ ముగించగా మల్హోత్రా జట్టు 134పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు