India A Women : ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం.. మ‌రో మ్యాచ్ ఉండ‌గానే..

శుక్ర‌వారం భారత్-ఎ మహిళల జ‌ట్టు, ఆసీస్-ఎ మహిళల జ‌ట్టు (India A Women vs Australia A Women )తో రెండో వ‌న్డే మ్యాచ్‌లో త‌ల‌ప‌డింది.

India A Women : ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం.. మ‌రో మ్యాచ్ ఉండ‌గానే..

India A Women won by 2 wickets against Australia A Women in 2nd ODI

Updated On : August 15, 2025 / 3:10 PM IST

India A Women vs Australia A Women : ఆస్ట్రేలియా గ‌డ్డ పై భారత్-ఎ మహిళల జ‌ట్టు అద‌ర‌గొట్టింది. మూడు మ్యాచ్‌ల అనధికారిక వ‌న్డే సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది. త‌ద్వారా టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన క్లీన్ స్వీప్ ప‌రాభ‌వానికి ప్రతీకారం తీర్చుకున్న‌టైంది.

బ్రిస్బేన్‌ వేదికగా శుక్ర‌వారం భారత్-ఎ మహిళల జ‌ట్టు, ఆసీస్-ఎ మహిళల జ‌ట్టు (India A Women vs Australia A Women )తో రెండో వ‌న్డే మ్యాచ్‌లో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ మ‌హిళ‌ల జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌ల‌లో అలిస్సా హీలీ (91; 87 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకుంది. కిమ్‌ గార్త్‌ (41 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు) రాణించింది. భార‌త బౌల‌ర్ల‌లో మిన్ను మణి మూడు వికెట్లు తీసింది. సైమా ఠాకోర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. రాధా యాదవ్‌, టిటాస్ సాధు, ప్రేమా రావత్‌, తనుజా కన్వర్ లు త‌లా ఓ వికెట్‌ తీశారు.

Virender Sehwag : అప్పుడు స‌చిన్ ఆపాడు.. లేదంటేనా.. 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు మూడేళ్ల ముందు జ‌రిగిన విష‌యాన్ని వెల్ల‌డించిన సెహ్వాగ్‌..

ఆ త‌రువాత యస్తికా భాటియా (66; 71 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (60; 78 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) తనూజా కన్వర్‌ (50; 57 బంతుల్లో 3 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో సాధించ‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 49.5 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది. ప్రేమా రావత్‌ (32 నాటౌట్; 33 బంతుల్లో 3 ఫోర్లు) రాణించింది.

193 ప‌రుగుల‌కే 7 వికెట్లు..
ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ ఓ ద‌శ‌లో 193 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా ప‌య‌నించింది. ఈ ద‌శ‌లో త‌నూజా క‌న్వీర్, ప్రేమా రావ‌త్‌లు జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 68 ప‌రుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 5 ప‌రుగులు అవ‌స‌రం అయిన ద‌శ‌లో తొలి బంతికి త‌నూజా క‌న్వీర్ ఔట్ అయింది. అయిన‌ప్ప‌టికి ప్రేమా రావ‌త్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది. ఆసీస్‌ బౌలర్లలో జార్జియా, యామీ ఎడ్గర్‌, హేవర్డ్ త‌లా రెండు వికెట్లు తీశారు. కిమ్‌ గార్త్‌ ఓ వికెట్ సాధించింది.

Top end T20 series : పాక్ ఆట‌గాళ్లు ఇలాగే ఉంటారా? చిన్న‌పిల్లాడిలా ర‌నౌట్‌.. బ్యాట్ విసిరేస్తూ, బండ‌బూతులు.. వీడియో

ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం (ఆగస్ట్‌ 17న) జరుగనుంది.