Top end T20 series : పాక్ ఆటగాళ్లు ఇలాగే ఉంటారా? చిన్నపిల్లాడిలా రనౌట్.. బ్యాట్ విసిరేస్తూ, బండబూతులు.. వీడియో
ఆస్ట్రేలియా వేదికగా టాప్-ఎండ్ టీ20 సిరీస్ (Top end T20 series) జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు కూడా పాల్గొంది.

Pakistan Shaheens Opener Throws Bat, Shouts At Partner Over Run Out
Top end T20 series : సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్ని సార్లు బ్యాటర్లు తమ తప్పిదం లేదంటే తమ పార్ట్‌నర్‌ల తప్పిదం కారణంగా రనౌట్లు కావడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ పాక్ బ్యాటర్ మాత్రం రనౌట్ కావడంతో తన పార్ట్‌నర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండ బూతులు తిట్టాడు. అంతేకాదండోయ్ బ్యాట్‌ను సైతం విసిరివేయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా వేదికగా టాప్-ఎండ్ టీ20 సిరీస్ (Top end T20 series) జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు కూడా పాల్గొంది. గురువారం బంగ్లాదేశ్ ఏ జట్టుతో పాకిస్తాన్ షాహీన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యాసిర్ ఖాన్, ఖవాజా నఫే ఇద్దరూ కూడా హాప్ సెంచరీలు చేయడంతో 11 ఓవర్లకు పాకిస్తాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది.
12వ ఓవర్‌ను మృతుంజయ్ చౌదరి వేశాడు. తొలి బంతిని యాసిర్ ఖాన్ షాట్ ఆడాడు. అయితే.. బంతి అతడి ప్యాడ్లను తాకి, కాలిని తాకి పిచ్ పక్కన లెగ్ సైడ్‌కి వెళ్లింది. ఈ సమయంలో ఖవాజా సింగిల్ కోసం పిలవగా, యాసిర్ కూడా ఒక అడుగు ముందుకు వేసి బంతి పక్కనే ఉందన్న విషయం గ్రహించి వెనక్కి తగ్గాడు. సింగిల్ వద్దంటూ అరుస్తూ, చేతితో సంజ్ఞ కూడా చేశాడు.
Maybe the two Pakistani openers will talk through their mix up nice and calmly…
Or maybe Yasir and Nafay have a different way of communicating 🫣#TopEndT20 | Live on 7plus pic.twitter.com/40kLUR2PBA
— 7Cricket (@7Cricket) August 14, 2025
వీటిని పట్టించుకోని ఖవాజా దాదాపు స్ట్రైకింగ్ ఎండ్ వైపుకు వచ్చేశాడు. బంతిని అందుకున్న బంగ్లాదేశ్ -ఏ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ దానిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపుగా విసిరాడు. వికెట్ కీపర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన ఖవాజా వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే.. అతడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపుకు చేరుకునే సమయాని కన్నా ముందే వికెట్ కీపర్ విసిరిన బంతిని అందుకున్న బౌలర్ వికెట్లు పడగొట్టాడు.
దీంతో ఖవాజా నఫే రనౌట్ అయ్యాడు. తాను రనౌట్ కావడంతో ఖావాజా నఫే కోపం నషాలానికి అంటింది. తన చేతిలోని బ్యాట్‌ను విసిరి వేస్తూ.. యూసిర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. తొలి వికెట్ కు యాసిర్, నఫేలు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో యాసిర్ ఖాన్ (62), ఖవాజా నఫే (61), అబ్దుల్ సమద్ (56)లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు 16.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 79 పరుగుల తేడాతో విజయం సాధించింది.