CPL 2025 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో బౌలర్ల హవా.. ఆంటిగ్వా పై సెయింట్ కిట్స్ విజయం..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) ప్రారంభమైంది.

St Kitts and Nevis Patriots won by 6 wickets in CPL 2025 first match
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) ప్రారంభమైంది. సీపీఎల్ 13వ ఎడిషన్‌లో భాగంగా తొలి మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టుతో తలపడింది. బౌలర్లు చెలరేగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ఆంటిగ్వా బ్యాటర్లలో కరీమా గోర్ (61; 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
మిగిలిన వారిలో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆంటిగ్వా తక్కువ స్కోరుకే పరిమితమైంది. సెయింట్ బౌలర్లలో వకార్ సలాంఖైల్ నాలుగు వికెట్లు తీశాడు. నసీమ్ షా, ఫజల్హాక్ ఫారూఖీ లు చెరో రెండు వికెట్లు తీశారు. కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ జట్టు 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్ (37 నాటౌట్), ఎవిన్ లూయిస్ (25), ఆండ్రీ ఫ్లెచర్ (19), జేసన్ హోల్డర్ (18 నాటౌట్) రాణించారు.
ఆంటిగ్వా బౌలర్లలో రహకీమ్ కార్న్‌వాల్ రెండు వికెట్లు తీశాడు. గజన్‌ఫర్, ఒబెడ్ మెక్కాయ్ లు చెరో వికెట్ పడగొట్టారు.