Rohit Sharma Dance Video : ఓరీ నాయనో.. డ్యాన్స్‌తో దుమ్ములేపిన రోహిత్ శర్మ.. భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులు..
రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి డ్యాన్స్ (Rohit Sharma Dance) చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో..

Team India Captain Rohit Sharma dance with his Wife Ritika Sajdeh
Rohit Sharma Dance Video : టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో కొంచెం సీరియస్‌గా ఉండటానే చూస్తూ ఉంటాం. అతడు సరదాగా నవ్వుతూ డ్యాన్స్ చేయడం ఎంతో అరుదు అనే చెప్పాలి. కాగా.. హిట్‌మ్యాన్ తన భార్య రితికా సజ్దే(Ritika Sajdeh)తో కలిసి డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఈ వీడియో తాజాగా తీసినది కాదని తెలుస్తోంది. 2023 నాటిదని అంటున్నారు. రితికా సోదరుడి పెళ్లి వేడుకలో రోహిత్ డ్యాన్స్ ( Rohit Sharma Dance Video) చేసినట్లుగా సమాచారం. ఈ వీడియోలో రోహిత్ శర్మ, రితికాతో పాటు పెళ్లి కూతురు కూడా వేదిక పై సరదాగా స్టెప్పులు వేసింది. స్టేజీ పై డ్యాన్స్ చేయడానికి ముందు ఇంట్లో ప్రాక్టీస్ చేసినట్లు కూడా వీడియో ద్వారా అర్థమవుతోంది.
వన్డేల్లో మాత్రమే..
38 ఏళ్ల రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కాగా.. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్ రెండో స్థానానికి దూసుకువెళ్లాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ లో పాక్ ఆటగాడు బాబర్ ఆజాం పేలవ ప్రదర్శన చేయడం హిట్‌మ్యాన్‌కు కలిసి వచ్చింది.
Rohit Sharma and Ritika bhabhi from practicing dance at home to dancing on stage during Ritika’s brother wedding.🔥❤️ pic.twitter.com/xfSQ5mE3JG
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 13, 2025
అక్టోబర్‌లోనే..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభం కానుంది. గతసారి ఈ టోర్నీని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గెలుపొందింది. అయితే.. ఈ సారి ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఆడడం లేదు. ఎందుకంటే ఈ సారి టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుండడమే అందుకు కారణం.
ఈ ఏడాది అక్టోబర్‌లోనే రోహిత్ శర్మను టీమ్ఇండియా జెర్సీలో మైదానంలో చూసే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరగనుంది.
ఆసీస్‌తో సిరీస్ కోసం రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ముంబైలో భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి శిక్షణ ప్రారంభించాడు. వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడమే తన కల అని పలు సందర్భాల్లో రోహిత్ శర్మ చెప్పాడు. అంటే అతడు 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అర్థమవుతోంది.