Jos Buttler Century : విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన జోస్ బట్లర్

ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఐపీఎల్ లో ఎనిమిది సెంచరీలు చేశాడు.

KKR vs RR IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ లో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. జోస్ బట్లర్ అద్భుత బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ (107; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సు) అద్భుతమైన సెంచరీతో విజృంభించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ రికార్డును కూడా బట్లర్ బద్దలు కొట్టాడు.

Also Reada : IPL 2024 : ఐపీఎల్‌లో హ్యాట్రిక్, సెంచరీ.. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ సరసన సునీల్ సరైన్

ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఐపీఎల్ లో ఎనిమిది సెంచరీలు చేశాడు. ఆ విషయంలో క్రిస్ గేల్ ఆరు సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే, తాజాగా కేకేఆర్ జట్టుపై సెంచరీ చేయడం ద్వారా ఏడు సెంచరీలతో జోస్ బట్లర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. వీరి తరువాత స్థానంలో నాలుగు సెంచరీలతో కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ ఉన్నారు.

Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ!

 

ట్రెండింగ్ వార్తలు