IPL 2024 : ఐపీఎల్‌లో హ్యాట్రిక్, సెంచరీ.. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ సరసన సునీల్ సరైన్

ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేరుపై రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాక.. హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనతను కూడా రోహిత్ సాధించాడు.

IPL 2024 : ఐపీఎల్‌లో హ్యాట్రిక్, సెంచరీ.. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ సరసన సునీల్ సరైన్

Sunil Narine

IPL 2024 KKR vs RR : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. కేకేఆర్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ సునీల్ సరైన (106; 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్)తో సెంచరీ చేశాడు. తద్వారా సరైన్ తనపేరుపై రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ ల సరసన నిలిచాడు.

Also Read : ఎస్ఆర్‌హెచ్‌, ఆర్సీబీ మ్యాచ్.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ మాత్రమే సెంచరీ, హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు. తాజాగా ఆ జాబితాలో సునీల్ సరైన్ చేరిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ లో సునీల్ సరైన 49 బంతుల్లో సెంచరీ చేశాడు. బౌలర్ గా అతను 2013లో కేకేఆర్ తరపున ఆడుతున్నప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుపై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. వరుసగా మూడు బంతుల్లో డేవిడ్ హస్సీ, అజర్ మహమూద్, గురకీరత్ సింగ్ లను అవుట్ చేశాడు. సునీల్ సరైన ఐపీఎల్ చరిత్రలో మొత్తం 168 మ్యాచ్ లు ఆడగా అందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1,322 పరుగులు చేశాడు. మరోవైపు బౌలర్ గానూ రాణించాడు. మరోవైపు.. కేకేఆర్ జట్టు తరపున సెంచరీ చేసిన మూడో బ్యాటర్ గానూ సరైన ఘనత సాధించాడు. గతంలో బ్రెండన్ మెక్ కలమ్ (2008లో 158 పరుగులు), వెంకటేశ్ అయ్యర్ (2023లో 104 పరుగులు) సెంచరీలు చేశారు.

Also Read : Dinesh Karthik : వరుస బౌండరీలతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వణికించిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్

ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేరుపై రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాక.. హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనతను కూడా రోహిత్ సాధించాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ వరుసగా మూడు బంతుల్లో అభిషేక్ నాయక్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను పెవిలియన్ కు పంపాడు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ కూడా సెంచరీతో పాటు హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఐపీఎల్ కెరీర్ లో వాట్సన్ నాలుగు సెంచరీలు చేశాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ పై హ్యాట్రిక్ సాధించాడు. మూడు బంతుల్లో వరుసగా శిఖర్ ధావన్, మోయిసెస్ హెన్రిక్స్, కర్ణ్ శర్మలను వాట్సన్ ఔట్ చేశాడు.

Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ!