Dinesh Karthik : వరుస బౌండరీలతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వణికించిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్

హైదరాబాద్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో దినేశ్ కార్తీక్ వరుస సిక్సర్లతో కొద్దిసేపు ఆర్సీబీ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. దినేశ్ కార్తీక్ కేవలం 34 బంతుల్లోనే ..

Dinesh Karthik : వరుస బౌండరీలతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వణికించిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్

Dinesh Karthik

IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ ఏదంటే.. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనక తప్పదు. సోమవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. మ్యాచ్ జరిగినంత సేపు సిక్సులు, ఫోర్లతో స్టేడియం హోరెత్తింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు.. ఆది నుంచి వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీరవిహారం చేసి కొద్దిసేపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టలో ఓటమి భయాన్ని కల్పించాడు.

Also Read : Varsha Bollamma : మళ్ళీ RCB ఓటమి.. హార్ట్ బ్రేక్ అయింది అంటున్న వర్ష బొల్లమ్మ..

ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 549 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఇది. ఈ మ్యాచ్ లో ఇరుజట్ల బ్యాటర్లు మొత్తం 43 ఫోర్లు, 38 సిక్సులు కొట్టారు. అయితే, 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ దూకుడుగా ఆడారు. కోహ్లీ (42) భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ కాగా.. డూప్లెసిస్ (62) కూడా కొద్దిసేపటికే పెవిలియన్ బాట పట్టాడు. వరుసగా ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ బాట పట్టారు. హైదరాబాద్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో దినేశ్ కార్తీక్ వరుస సిక్సర్లతో ఆర్సీబీ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు.

Also Read : Rohit Sharma : చెన్నైపై ఓట‌మి.. బాధ‌తో ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్‌కు రోహిత్ శ‌ర్మ‌..

దినేశ్ కార్తీక్ కేవలం 34 బంతుల్లోనే ఏడు సిక్సులు, ఏడు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు స్టేడియం మొత్తం దినేశ్ నామస్మరణతో మారుమోగిపోయింది. దినేశ్ కార్తీక్ ఔట్ అయ్యి పెవిలియన్ కు వెళ్లే సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులందరూ లేచినిలబడి దినేశ్ కార్తీక్ కు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.