Jos Buttler : చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడు..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 12, 2026 / 02:59 PM IST
Jos Buttler scripts history highest individual scores against India in T20s
Jos Buttler : ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భారత్ పై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో బట్లర్ 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ ఎవిన్ లూయిస్ (125 నాటౌట్)ను అధిగమించాడు. అంతేకాదండోయ్.. పలు రికార్డులను సైతం బట్లర్ అందుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించాడు. విరాట్ తన టీ20 కెరీర్‌లో 4188 పరుగులు చేయగా.. తాజా ఇన్నింగ్స్‌తో కలిపి బట్లర్ ఇప్పటి వరకు 4212 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో బాబర్ ఆజామ్ (4596) ఉండగా రెండో స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (4231) ఉన్నాడు.
Lionel Messi : చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ.. మారడోనా రికార్డు బ్రేక్..
భారత్ పై టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 131 పరుగులు
* ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) – 125 నాటౌట్
* షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) – 124 నాటౌట్
* గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 113 నాటౌట్
ఇక ఇంగ్లాండ్ తరుపున టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో ఫిల్ సాల్ట్ ఉన్నాడు. సాల్ట్ 141 పరుగులు చేశాడు.
Team India : భారత్‌కు మరో భారీ షాక్.. 1605 రోజుల పాటు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జోస్ బట్లర్ (131; 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (95 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శివమ్ దూబె రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు.
