Kamindu Mendis becomes fastest Asian to hit 5 Test hundreds
Kamindu Mendis : శ్రీలంక నయా బ్యాటింగ్ సంచలనం కమిందు మెండిస్ టెస్టుల్లో అరంగ్రేటం చేసినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఇన్నింగ్స్‌ల పరంగా వేగంగా ఐదు శతకాలు బాదిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శతకం చేయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది 5 సెంచరీ కాగా.. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని అందుకోవడం విశేషం.
ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో ఐదు శతకాలను అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో చేసిన ఆటగాళ్ల జాబితాలో కమింద్ మెండిస్.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ డాన్ బ్రాడ్‌మాన్, వెస్టిండీస్ ఆటగాడు జార్జ్ హెడ్లీలతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో ఎవర్టన్ వీక్స్ (10), హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (12), నీల్ హార్వే (12)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Ashwin : చరిత్ర సృష్టించిన అశ్విన్.. టెస్టుల్లో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా..
ఐదు టెస్ట్ సెంచరీలు అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో చేసిన ఆటగాళ్లు..
ఎవర్టన్ వీక్స్ – 10 ఇన్నింగ్స్‌ల్లో
హెర్బర్ట్ సట్‌క్లిఫ్ – 12 ఇన్నింగ్స్‌ల్లో
నీల్ హార్వే – 12 ఇన్నింగ్స్‌ల్లో
డాన్ బ్రాడ్‌మాన్ – 13 ఇన్నింగ్స్‌ల్లో
జార్జ్ హెడ్లీ – 13 ఇన్నింగ్స్‌ల్లో
కమిందు మెండిస్ – 13* ఇన్నింగ్స్‌ల్లో
కాగా.. కమిందు మెండిస్ చేసిన ఐదు శతకాలలో.. రెండు న్యూజిలాండ్ పై రెండు బంగ్లాదేశ్ పై చేయగా ఓ శతకం ఇంగ్లాండ్ బాదాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు లంచ్ విరామానికి తొలి ఇన్నింగ్స్‌లో లంక 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (135), కుశాస్ మెండిస్ (70)లు క్రీజులో ఉన్నారు.
5 HUNDREDS FROM JUST 13 INNINGS FOR KAMINDU MENDIS 🤯
– 2 Hundreds vs NZ*.
– 2 Hundreds vs BAN.
– 1 Hundred vs ENG25-year-old KAMINDU ruling Test cricket for Sri Lanka 🥶 pic.twitter.com/rsZFiEc35b
— Johns. (@CricCrazyJohns) September 27, 2024