Williamson vs Virat Kohli: ఆత్మీయ ఆలింగనం.. మూడు ముఖ్యమైన మ్యాచ్‌లలో వర్షమే ఆటంకం!

విరాట్ కోహ్లీ vs విలియమ్సన్: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC 2021)ను న్యూజిలాండ్‌ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది.

Williamson Hugging Virat Kohli: విరాట్ కోహ్లీ vs విలియమ్సన్: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC 2021)ను న్యూజిలాండ్‌ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది. చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ను సొంతం చేసుకున్న కివీస్ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ను అభినందిస్తూ కోహ్లీ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ చరిత్రలో వీరిద్దరికి ఉండే క్రేజ్ వేరు.. మంచి కెప్టెన్‌లుగా పేరున్న వీరు ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో కీలక మ్యాచ్‌లలో కెప్టెన్‌లుగా తలపడుతూ ఉన్నారు.


విలియమ్సన్‌.. ఓపికతో ఉంటూ నిర్ణీత సమయంలో ఒత్తిడి తెస్తాడు. విరాట్‌ మాత్రం ఎప్పుడూ ఒత్తిడి తెస్తూనే ఉంటాడు అని నిపుణులు వీరి గురించి విశ్లేషిస్తూ ఉంటారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ, విలియమ్సన్ మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. భారత్-కివీస్ మధ్య అండర్-19 మ్యాచ్ 2008 ఫిబ్రవరిలో జరిగింది. ఆ మ్యాచ్‌లో కూడా భారత జట్టుకు కోహ్లి, న్యూజీలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించగా.. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సారధ్యంలోని భారత్ జట్టు నెగ్గింది.


మలేసియా రాజధాని కౌలాలంపుర్‌లో మ్యాచ్ జరగగా.. టాస్ గెలిచిన కివీస్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని, 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మ్యాచ్‌ మధ్యలో వర్షం పడగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 43 ఓవర్లలో 191 పరుగులకు కుదించారు. భారత్ 41.3 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వీరిద్దరి కలియికలో మొదటి ముఖ్యమైన మ్యాచ్.


తర్వాత 2019 ప్రపంచకప్ క్రికెట్‌లో టీమిండియా ఫైనల్‌కు ముందు విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ చేతిలో చతికిలపడింది. లీగ్ దశలో అగ్రగామిగా నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో కివీస్ చేతిలో ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో కివీస్ ఇచ్చిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలం అయ్యింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో కూడా న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రెండ్రోజులు జరిగింది. విశేషం ఏమింటంటే మూడు మ్యాచ్‌లలోనూ వర్షమే ఆటంకం కలిగించింది.

ట్రెండింగ్ వార్తలు