Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం

ఈనెల 24 నుంచి పుణె వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ..

Kane Williamson

IND vs NZ 2nd Test: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్న న్యూజిలాండ్ జట్టుకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు విలియమ్సన్ అందుబాటులో ఉండడని కివీస్ క్రికెట్ బోర్డు పేర్కొంది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వస్తాడని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆ ఇద్దరు ఆట‌గాళ్ల‌పై వేటు తప్పదా.. వాళ్లెవరంటే..

ఈనెల 24 నుంచి పుణె వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత్ జట్టుకు పెద్ద సమస్యే. మరోవైపు న్యూజిలాండ్ జట్టుకుసైతం ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. దీంతో ఇరు జట్లు రెండో టెస్టులో విజయం సాధించేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కీలక బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టు కు దూరమవ్వడం న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అయితే, విలియమ్సన్ మొదటి టెస్టులోనూ ఆడలేదు. సెప్టెంబర్ లో శ్రీలంకలో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా గాయం కారణంగా విలియమ్సన్ ఇండియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, అతను పూర్తి ఫిట్ నెస్ పొందడానికి న్యూజిలాండ్ లోనే ఉన్నాడు.

Also Read: David Cameron : విరాట్ కోహ్లీ పై బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని డేవిడ్ కామెరూన్ కామెంట్స్‌..

ఈ విషయంపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. విలియమ్సన్ పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించలేదు. అతను ఇండియాతో రెండో టెస్టులో ఆడేందుకు సిద్ధంగా లేడు. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆవిస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే .. తొలి టెస్టులో విలియమ్సన్ స్థానంలో విల్ యంగ్ ఆడాడు. యంగ్ మొదటి ఇన్నింగ్స్ లో 33 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో అజేయంగా 48 పరుగులు చేశాడు.