T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు వీరే..
టీ20 ప్రపంచకప్ 2026కు (T20 World Cup 2026) మ్యాచ్ అధికారుల జాబితాను ఐసీసీ ప్రకటించింది.
T20 World Cup 2026 ICC announces list of match officials
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వెలువడగా తాజాగా మ్యాచ్ అధికారుల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్న గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 24 మంది ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా, మరో ఆరుగురు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. సూపర్-8, నాకౌట్ దశ మ్యాచ్‌లకు సంబంధించిన అంపైర్ల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ ప్రారంభ మ్యాచ్‌కు కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇక కోల్‌కతా వేదికగా ప్రారంభ రోజున జరగనున్న స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వర్తించనున్నారు.
ఫిబ్రవరి 7న ముంబై వేదికగా భారత్ వర్సెస్ యూఏఎస్ మ్యాచ్‌కు పాల్ రీఫెల్, రాడ్ టక్కర్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమితులయ్యారు. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగనుంది. ఈ మ్యాచ్‌కు కుమార్ ధర్మసేన, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు అధికారులు వీరే..
మ్యాచ్ రిఫరీలు..
డీన్ కాస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్.
Ravi Shastri : 20లో ఆ రెండు 300 కొడుతాయ్.. టీ20 ప్రపంచకప్ ముందు రవిశాస్త్రి కామెంట్స్..
ఆన్ ఫీల్డ్ అంపైర్లు వీరే..
రోలాండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డోనోవన్ కోచ్, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, కెఎన్ఎ పద్మనాభన్, అల్లావుద్దీన్ పాలేకర్, లే పాల్ రెలీఫ్ రజకీ, అహ్సాన్ రెజ్లీఫ్జారీ, అహ్సాన్ రెజ్లీఫ్జారే షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, గాజీ సోహెల్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాకూబ్.
