Kidambi Srikanth Met CM Chandrababu Naidu To Invite For His Wedding
మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తనకు కాబోయే భార్య శ్రావ్య వర్మతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. తమ పెళ్లికి రావాలంటూ సీఎంను కాబోయే జంట ఆహ్వానించింది. ఈ మేరకు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు.
ఇక కిదాంబి శ్రీకాంత్ చేసుకోబోయే శ్రావ్య వర్మ ఎవరో కాదు… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. టాలీవుడ్‌లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్. కింగ్ అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధ్రువ్ వంటి స్టార్స్‌కు ఆమె స్టైలిస్ట్‌గా పని చేశారు. ఇక హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు మంచి అనుబంధం ఉంది.
ఆయన తనకు సోదరుడు లాంటి వాడని పలు సందర్భాల్లో చెప్పారు. చిలసౌ, మ్యాస్ట్రో చిత్రాలకు శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రస్తుతం రష్మిక కథానాయికగా నటిస్తోన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి పని చేస్తోంది. అంతేకాదండోయ్.. కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లఖ్ సఖి’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది.
Gautam Gambhir : శ్రీలంక, కివీస్ చేతుల్లో ఓడిన భారత్.. ఆసీస్ పర్యటన గంభీర్‌కి అగ్నిపరీక్ష?
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.