KL Rahul : KL రాహుల్ విధ్వంసం.. IPL రికార్డ్ బ్రేక్.. 47 బంతుల్లోనే
KL Rahul : ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటుతో కదం తొక్కి రికార్డ్ బ్రేక్ చేశాడు.
- Dharani Pilli
- Updated on- April 25, 2026 / 06:38 PM IST
KL Rahul Records Highest Score as Indian IPL 2026 Delhi Capitals vs Punjab Kings
- ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ నయా రికార్డ్
- 67 బంతుల్లో 152 పరుగులు
- 150+ స్కోర్ చేసిన తొలి ఇండియన్
KL Rahul : ఐపీఎల్-2026లో కేఎల్ రాహుల్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ బాది రికార్డ్ బ్రేక్ చేశాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పరుగుల సునామీ సృష్టించాడు. 12 పరుగుల వద్ద అవుటవ్వాల్సిన రాహుల్.. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత మరిక వెనుతిరగలేదు. వీర బాదుడు బాదుతూ.. పరుగుల వరద పారించాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు.
రాహుల్ బ్యాటింగ్ ధాటికి.. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తం 67 బంతుల్లో 152 పరుగులు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 6వ సెంచరీని పూర్తి చేశాడు. పైగా రాహుల్ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొత్తం 67 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
రాహుల్‌కు ఇదే ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
12 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాహుల్ క్యాచ్ విడిచిపెట్టిన శశాంక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డర్‌ను ఇప్పటివరకు చూడలేదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. శశాంక్ ఫీల్డింగ్‌పై పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అభిషేక్ రికార్డ్ బ్రేక్
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. అలానే అభిషేక్ శర్మ చేసిన 141 పరుగుల రికార్డ్ ను నేడు ఏప్రిల్ 25, 2026 శనివారం నాడు రాహుల్ బ్రేక్ చేశారు. మరో విశేషం గతంలో రాహుల్ పేరు మీద ఉన్న 132 పరుగుల రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి.. నేడు తొలి స్థానం దక్కించుకున్నాడు.
