IND vs WI : శతక్కొట్టిన కోహ్లీ, గిల్.. తొలి వన్డేలో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (IND vs WI)భారత్ ఘనంగా బోణీ కొట్టింది.
Shubman Gill and Virat Kohli hundreds helps Team India beat West Indies in 1st ODI
IND vs WI : వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీ చేశాడు. జాన్ క్యాంప్‌బెల్ (62; 60 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అమీర్ జంగూ (58 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ సాధించాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్లో ఏకైక ఆటగాడు..
🔙 to 🔙 to seal the deal 👊#TeamIndia with a clinical chase in just 4️⃣1️⃣.4️⃣ overs to win by 8️⃣ wickets 👏👏
Scorecard ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ pic.twitter.com/SUj4bbE9rh
— BCCI (@BCCI) September 27, 2026
అనంతరం 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) లు శతకాలతో చెలరేగారు. రోహిత్ శర్మ (32; 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (13 నాటౌట్; 9 బంతుల్లో) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ పడగొట్టారు.
