కోహ్లీ కావాలని ఎవరినీ కించపరచలేదు: పూజారా

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రికార్డులు కొల్లగొట్టడంలోనే కాదు. జట్టు కోసం మైదానంలో ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. తమ జట్టు ప్లేయర్ల జోలికొస్తే అంతే స్థాయిలో స్లెడ్జింగ్‌కు దిగి దానికి తగ్గ సమాధానం చెప్తాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన టిమ్ పైనెతో కోహ్లీ కావాలనే వివాదానికి దిగినట్లు అంపైర్లంతా కోహ్లీపై విమర్శలు గుప్పించారు. 

ఆసీస్ పర్యటనలో విరాట్ ఎవరినీ కించపరిచే విధంగా ప్రవర్తించలేదని టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా పేర్కొన్నాడు. సంవత్సరారంభంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. పూజారా విమర్శలన్నిటికీ కలిపి ఈ విధంగా బదులిచ్చాడు. 

‘క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే కోహ్లీ..  ఆట కోసం అమితంగా కష్టపడతాడు. అంతేకాదు.. మైదానంలో ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ కూడా అతను అగౌరవరచలేదు. ఇక స్లెడ్జింగ్ విషయానికొస్తే.. అది ఆటలో భాగమే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఏదేమైనా, అతని అంతిమ లక్ష్యం ఒక్కటే. జట్టు గెలుపు. మ్యాచ్‌ సమయంలో చాలాసార్లు అతనికి సలహాలిస్తుంటా. వాటిని శ్రద్ధగా వింటాడు. అయితే.. మైదానంలో మాత్రం కోహ్లీ కొంచెం దూకుడుగా ఉంటాడు. అది అతని నైజం’ అని పుజారా వెల్లడించాడు. 

Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: ఈఎంఐ కట్టనేలేదు: ఆపిల్ అనుకొని ‘ఐఫోన్’ విసిరాడు