Korea Open Badminton : సెమీస్‌లో పోరాడి ఓడిన పీవీ సింధు.. సుయాంగ్‌కు నాల్గో విజయం..!

Korea Open Badminton : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు ఆన్ సుయాంగ్ చేతిలో ప‌రాజ‌యం పొందింది.

Korea Open Badminton : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఓటమిపాలైంది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ కొరియా ఓపెన్ సూపర్‌-500 టోర్నీలో భాగంగా శనివారం (ఏప్రిల్ 9) జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు ఆన్ సుయాంగ్ చేతిలో ప‌రాజ‌యం పొందింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్‌లో సింధు ఓటమిని చవిచూసింది.

గ‌తంలోనూ ఆన్ సుయాంగ్ 3 సార్లు పీవీ సింధుపై పైచేయి సాధించింది. ఈసారి కూడా ఓపెన్ సింగిల్స్‌లో సింధుపై ఆన్ సుయాంగ్ ఆధిప‌త్యం కొనసాగించింది. ఫలితంగా 4వసారి కూడా సింధుపై గెలిచి సుయాంగ్ హ్యాట్రిక్ సాధించింది. అంతకుముందు మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 21-10, 21-16తో బుసానన్‌ ఓంగ్‌బమ్రున్‌ఫాన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ కూడా కొరియా ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో బుసానన్‌ను మట్టికరిపించి టైటిల్‌ సాధించిన సింధు క్వార్టర్స్‌లోనూ అదే జోరు సాగించింది. 44 నిమిషాల్లో ముగిసిన పోరులో స్మాష్‌లు, డ్రాప్‌లతో క్రాస్‌ కోర్ట్‌ షాట్‌లతో సింధు దూకుడు పెంచింది. వరుస గేమ్‌ల్లో తనదైన ఆటతో తెలుగమ్మాయి బుసానన్‌పై 17వ విజయాన్ని నమోదు చేసింది.

Read Also : PV Sindhu: స్విస్ ఓపెన్ టైటిల్ సింధుదే..!

ట్రెండింగ్ వార్తలు