Liam Livingstone : కావ్యా పాప ఎంత ప‌ని జేస్తివి.. స‌న్‌రైజ‌ర్స్‌కు గుదిబండగా మారిన స్టార్ ప్లేయ‌ర్‌.. 15 ర‌న్స్ 13 కోట్లు..

స‌న్‌రైజ‌ర్స్ స్టార్ ఆట‌గాడు లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone) ఐపీఎల్ 2026లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Liam Livingstone flop show in IPL 2026

  • ఐపీఎల్ 2026లో ఘోరంగా విఫ‌ల‌మైన లియామ్ లివింగ్ స్టోన్
  • 2 మ్యాచ్‌ల్లో 15 ప‌రుగులు
  • వేలంలో 13 కోట్ల‌కు అత‌డిని సొంతం చేసుకున్న స‌న్‌రైజ‌ర్స్

Liam Livingstone : ఐపీఎల్ 2026 మెగావేలంలో ఆట‌గాళ్ల పై కోట్ల వ‌ర్షం కురిసింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని స్టార్ ఆట‌గాళ్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీప‌డ్డాయి. అలాంటి వారిలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్ స్టోన్ ఒక‌డు. ఈ స్టార్ ఆట‌గాడిని వేలంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఏకంగా 13 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది గానీ.. క‌ట్ చేస్తే ఐపీఎల్ 2026 ముగిసిన త‌రువాత ఈ నిర్ణ‌యం ఎంత పెద్ద త‌ప్పో కావ్యా పాప‌కు బాగా తెలిసి వ‌చ్చింద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి వేలంలో వ్యూహాత్మ‌కంగా ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌డంలో కావ్య మార‌న్ ఎప్పుడూ ముందుంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. మిడిల్ ఆర్డ‌ర్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడ‌ని లియాన్ లివింగ్ స్టోన్ పై ఫ్రాంఛైజీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలో వేలంలో అత‌డిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే.. ఈ స్టార్ ఆట‌గాడు ఫ్రాంఛైజీ పెట్ట‌కున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు.

ENG-W vs IND-W : ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. భార‌త్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మ‌హిళ‌ల ఫీల్డింగ్ వైర‌ల్‌.. న‌వ్వ‌కుండా ఉండ‌లేరు..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేవ‌లం రెండు అంటే రెండే మ్యాచ్‌ల్లో బ‌రిలోకి దిగాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి మొత్తం 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అత‌డు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగాడు. మిగిలిన ఆట‌గాళ్లు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తే అత‌డు విఫ‌లం అయ్యాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో అత‌డిని బెంచ్‌కే ప‌రిమితం చేశారు.

అత‌డికి వేలంలో ల‌భించిన మొత్తం చేసిన ప‌రుగుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఒక్కొ ప‌రుగుకు కోటీ రూపాయలు తీసుకున్నాడ‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Suryakumar Yadav : టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌! రేసులో హైద‌రాబాదీ కుర్రాడు..

జ‌ట్టు నుంచి ఔట్‌?

పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న లియామ్ లివింగ్ స్టోన్ జ‌ట్టులో కొన‌సాగించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అత‌డి వ‌దిలి వేసి.. ఆ న‌గ‌దులో వ‌చ్చే వేలంలో మ‌రో మంచి ఆట‌గాడిని తీసుకునే అవ‌కాశాలు లేక‌పోలేవ‌ని అంటున్నారు.