×
Ad

Lionel Messi India Tour: ”ది గోట్‌” ఇండియా టూర్‌.. 13న హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ గాడ్.. మెస్సీకి ఆ పేరు ఎలా వచ్చింది.. లెజెండ్ ఎలా అయ్యాడు..

2014 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో మెస్సీకి సవాళ్లు ఎదురయ్యాయి. 2015-16 కోపా అమెరికా ఫైనల్స్ ఓటమితో అభిమానులు ఏడ్చారు.

Lionel Messi India Tour: ది గోట్‌ ఇండియా టూర్‌.. ఇప్పుడు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ట్యాగ్‌ లైన్‌. ఈ నెల 13న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నాడు. అతడి ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్‌బాల్‌ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా ఎంతో ఆసక్తి, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 13న మెస్సీ ఉప్పల్‌ స్టేడియంలో తన ఆటతో మాయ చేయనున్నాడు. దీంతో ఇప్పటి నుంచే మెస్సీ మానియా మొదలైంది.

లియోనెల్ మెస్సీ.. ఫుడ్‌బాల్‌ ప్రపంచానికి లెజెండ్‌, గోట్‌, గాడ్‌.. అర్జెంటీనా రోసారియో వీధుల్లో, ధూళి ఆటలాడుకున్న ఆ చిన్ని కాళ్లు.. శరీరం.. హర్మోన్ గ్రోత్ డిసీజ్‌కు గురైంది. బాగు చేయాలంటే వేల డాలర్ల ఖర్చు కావాలన్నారు. కానీ కటిక దరిద్రం వెంటాడింది. అర్జెంటీనా క్లబ్‌లు సాయం చేయలేదు. ేర్వాత అదే మెస్సీ ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని శాసించాడు. దిగోట్‌ అని పిలిపించుకున్నాడు.

11 ఏళ్ల వయసులోనే ఆరోగ్య సమస్యలు..

1987 జూన్ 24న జన్మించిన మెస్సీ, ఐదేళ్లకే గ్రాండోలి క్లబ్‌లో ఆడటం మొదలుపెట్టాడు. కానీ 11 ఏళ్ల వయసులో డయాగ్నోస్.. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. చికిత్సకు నెలకు 900 డాలర్లు. అది ఆ కుటుంబానికి ఆకాశమంత భారం. అర్జెంటీనా క్లబ్‌లు వెనకడుగు వేశాయి. అప్పుడు వచ్చింది ఒక మిరాకిల్. స్పెయిన్‌లోని బార్సిలోనా స్కౌట్‌లు మెస్సీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. 13ఏళ్ల వయసులో మెస్సీ స్పెయిన్ వెళ్లాడు. బార్సిలోనా యూత్ అకాడమీ ‘లా మాసియా’లో అతని కాలు మ్యాజిక్ మొదలైంది.

2004 అక్టోబర్ 16.. 17 ఏళ్ల వయసులో బార్సిలోనా సీనియర్ టీమ్‌లో డెబ్యూ ఇచ్చాడు. మొదటి గోల్.. 2005 మే 1న. కానీ అసలు మ్యాజిక్ మొదలైంది 2008-09 సీజన్‌లో. పెప్ గ్వార్డియోలా కోచింగ్‌లో బార్సా ‘సెక్స్‌ టుపుల్’ గెలిచింది. లా లిగా, కోపా డెల్ రే, సూపర్ కప్, చాంపియన్స్ లీగ్, సూపర్ కప్, క్లబ్ వరల్డ్ కప్ ఇలా మెస్సీ 38 గోల్స్ చేశాడు. ఆ తర్వాత 2011-12 సీజన్ లో ఒకే ఏడాదిలో 91 గోల్స్ చేశాడు ఊపిరి ఆగిపోయేలా.

డ్రిబ్లింగ్‌తో డిఫెండర్లను ఆటలాడుకుంటూ, ఎడమ కాలితో మంత్రాలు చేస్తూ… 672 గోల్స్ చేశాడు. బార్సా కోసం 8 బాలన్ డిఓర్ అవార్డులు.. చరిత్రలో ఎవరూ సాధించని రికార్డ్. చాంపియన్స్ లీగ్‌లో 129 గోల్స్, 42 అసిస్ట్‌లు. ఒక మ్యాచ్‌లో 5 గోల్స్ ..మూడు సార్లు! 66 ఫ్రీ-కిక్ గోల్స్, 6 యూరోపియన్ గోల్డెన్ షూ… ప్రతి షాట్ ఒక మిరాకిల్! మెస్సీ అంటే కేవలం నంబర్లు కాదు.. ఫుట్‌బాల్‌ను గేమ్‌ అండ్‌ ఆర్ట్‌గా మార్చిన ఘనుడు.

2014 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో మెస్సీకి సవాళ్లు ఎదురయ్యాయి. 2015-16 కోపా అమెరికా ఫైనల్స్ ఓటమితో అభిమానులు ఏడ్చారు. మెస్సీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కానీ 2021లో కోపా అమెరికా గెలుపు అతడి మొదటి మేజర్ ట్రోఫీ! పడిలేచిన కెరటంలా 2022 ఖతార్‌ వరల్డ్ కప్ అర్జెంటీనా గెలిచింది. 36 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్.. మెస్సీ 13 గోల్స్, 8 అసిస్ట్‌లు .. ఒకే టోర్నమెంట్ రికార్డు. ఆ మూమెంట్ చూసి ప్రపంచమంతా గూస్ బంప్స్!

850కి పైగా గోల్స్, 109 అంతర్జాతీయ గోల్స్..

మొత్తం కెరీర్‌లో 850కి పైగా గోల్స్, 109 అంతర్జాతీయ గోల్స్ చేశాడు మెస్సీ. ఇప్పుడు 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాడు. అర్జెంటీనాలో అతని పేరుతో హాస్పిటల్, బార్సిలోనాలో పార్క్ ఉంది. అతను ఫుట్‌బాల్‌ ఆటనే మార్చేసిన గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌. మెస్సీని చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.. సంకల్పం గొప్పదైతే అసాధ్యం అనేది ఏమీ ఉండదని.

ఫుట్‌బాల్‌ లెజెండరీ ఆటగాడు లియోనల్‌ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నాడు. దీంతో ది గోట్‌ ఇండియా టూర్‌ ప్రస్తుతం స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఈనెల 13న లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌లో అడుగు పెట్టనున్నారు. ఈ నెల 12న రాత్రికి మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటాడు. 13న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ది గోట్‌ హైదరాబాద్‌కు చేరుకుంటాడు. అతడితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది బృందం హైదరాబాద్‌కు వస్తుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది.

మెస్సీ వసతి వివరాలను అధికారులు చాలా రహస్యంగా ఉంచారు. 13న సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటాడు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్‌ స్టేడియంలో మెస్సీ ఆటతో మాయ చేయనున్నాడు. తొలుత సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఒక జట్టుకు రేవంత్‌రెడ్డి.. మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. ఆ తర్వాత యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్‌ క్లాస్‌ కార్యక్రమం ఉంటుంది. పెనాల్టీ షూటౌట్‌ నిర్వహిస్తారు. చివర్లో మ్యూజికల్‌ కాన్సర్ట్‌ జరుగుతుంది. 13న రాత్రి మెస్సీ నగరంలోనే బస చేసి మర్నాడు ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరతాడు.

Also Read: జైస్వాల్ సూపర్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..