Lionel Messi : చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ.. మారడోనా రికార్డు బ్రేక్..
ఫిఫా 2026 ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ (Lionel Messi ) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 12, 2026 / 12:47 PM IST
Lionel Messi has recorded his 10th assist in FIFA World Cup
Lionel Messi : ఫిఫా 2026 ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. శనివారం స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. 10వ నిమిషంలో అలెక్సిస్ మాక్ అలిస్టర్ చేసిన గోల్‌కు పిన్‌పాయింట్ కార్నర్ నుంచి మెస్సీ అస్టిన్ ను అందించాడు. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక అసిస్ట్‌లు అందించిన ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు.
ప్రపంచకప్ చరిత్రలో 10 అసిస్టులు అందించిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా పేరిట ఉన్న 8 అసిస్టుల రికార్డును అధిగమించాడు.
Team India : భారత్‌కు మరో భారీ షాక్.. 1605 రోజుల పాటు..
ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక అసిస్టులు అందించిన ప్లేయర్లు వీరే(1966 నుంచి) ..
* లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) – 10
* డిగో మారడోనా (అర్జెంటీనా) – 8
* పియెర్రె లిట్‌బార్క్సీ (జర్మనీ) – 7
* జార్జ్ లాటో (పోలండ్) – 7
* డేవిడ్ బెక్‌హమ్ (ఇంగ్లాండ్) – 6
* పీలే (బ్రెజిల్) – 6
* థామస్ ముల్లర్ (జర్మనీ) – 6
39 ఏళ్ల వయసులోనూ ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన ప్రభావాన్ని కొనసాగిస్తున్న మెస్సీ.. గోల్స్‌తో పాటు అసిస్టుల రూపంలోనూ జట్టుకు కీలకంగా మారుతున్నాడు. నాలుగో ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు అతని అనుభవం పెద్ద బలంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌లో మెస్సీ 8 గోల్స్ సాధించాడు.
Argentina keep on getting it done 🇦🇷 pic.twitter.com/JHfpxUNlWt
— B/R Football (@brfootball) July 12, 2026
ఇదిలా ఉంటే.. స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
