Lionel Messi led World Champions Argentina to visit India this october
భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. అర్జెంటీనా స్టార్, దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగనుంది. దాదాపు 14 ఏళ్ల తరువాత భారత్‌లో మెస్సీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో మెస్సీ భారత్‌కు రానున్నాడు.
లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు 2025 అక్టోబర్‌లో కేరళలో జరగనున్న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని గతంలో కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్ రెహ్మాన్ తెలిపారు. కొచ్చిలో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనున్నట్లు వెల్లడించారు.
Rahul Dravid : మళ్లీ ఆ విషయాన్ని నిరూపించిన రాహుల్ ద్రవిడ్..
ఇప్పుడు తాజాగా దీనికి అధికారిక ముద్ర పడింది. బుధవారం హెచ్‌ఎస్‌బీసీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. భారత దేశంలో ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేసేందుకు అర్జెంటీనాతో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపింది. ఈ పర్యటనలో అర్జెంటీనా జట్టుకు హెచ్ఎస్‌బీసీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
హెచ్ఎస్‌బీసీతో అర్జెంటీనా ఫుట్ బాల్ సంఘం 2025లో భారత్‌తో పాటు సింగపూర్‌లో కూడా మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం చేసుకుంది.
కాగా.. 2011లో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు తొలిసారి మెస్సీ భారత్‌కు వచ్చాడు. కోల్‌కతాలో వెనిజులాతో జరిగిన నాటి మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో గెలుపొందింది.