Rahul Dravid : మళ్లీ ఆ విషయాన్ని నిరూపించిన రాహుల్ ద్రవిడ్..
ఓ ఆటగాడిగా, కోచ్‌గా ఇప్పటికే ఎన్నో సార్లు రాహుల్ ద్రవిడ్ ఈ విషయాన్ని నిరూపించాడు కూడా.

pic credi @ ani
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంకితభావానికి ద్రవిడ్ మారు పేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఓ ఆటగాడిగా, కోచ్‌గా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ విషయాన్ని అతడు నిరూపించాడు కూడా. ఇక తాజాగా ఐపీఎల్‌లో మరోమారు కోచ్‌గా అదే నిబద్దతను ప్రదర్శిస్తున్నాడు.
టీమ్ఇండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా, హెడ్ కోచ్‌గా ఎన్నో సేవలు అందించి భారత క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లిన వాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. అయితే.. ఈ దిగ్గజ ఆటగాడు ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు గాయపడ్డాడు. అతడి కాలికి గాయం కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
RR vs KKR : ఐపీఎల్ 2025లో కోల్‌కతా తొలి విజయం.. కెప్టెన్ రహానే ఏమన్నాడో తెలుసా?
కాలికి ఫ్రాక్చర్ అయినా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా తన టీమ్ రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించేందుకు, ఆటగాళ్లకు మార్గ నిర్దేశం చేసేందుకు మైదానంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

pic credit @ ani
టీ20 ప్రపంచకప్ 2024ను భారత జట్టుకు అందించిన తరువాత టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగిసింది. ఆ తరువాత అతడు ఐపీఎల్‌లో తన పాత గూడు అయిన రాజస్థాన్ రాయల్స్ చెంత చేరాడు. ఆ జట్టుకు ప్రధాన హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. అయితే.. ఈ సీజన్‌కు ముందు కాలికి గాయం కావడంతో తన వల్ల.. ప్లేయర్లకు ఇబ్బంది కలగకూడని, ఎంత కష్టమైనా సరే మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు.
RR vs KKR : కావాలనే క్వింటన్ డికాక్ సెంచరీని అడ్డుకున్న ఆర్చర్..

pic credit @ ani
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆర్ఆర్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్‌కు కాలికి ప్రత్యేకమైన బూట్ వేసుకుని కర్రల సాయంతో హాజరై.. ఆటపట్ల తనకున్న నిబద్ధతను చాటుకుని ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. ఇక ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలక్రిక్ వీల్ చెయిర్ లో కూర్చోని మైదానానికి వచ్చాడు. అంతేనా.. గౌహతి వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్ అనంతరం సూపర్ ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాను గెలిపించిన క్వింటన్ డికాక్ ను చేతి కర్రల సాయంతో నడుచుకుంటూ వచ్చి మరీ అభినందించాడు.

pic credit @ ani
ఈ క్రమంలో ద్రవిడ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆటపై తనకున్న అంకితభావాన్ని ది వాల్ మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.