RR vs KKR : కావాలనే క్వింటన్ డికాక్ సెంచరీని అడ్డుకున్న ఆర్చర్..
క్వింటన్ డికాక్ సెంచరీని జోఫ్రా ఆర్చర్ కావాలనే అడ్డుకున్నాడా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన కేకేఆర్.. బుధవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది. ఆర్ఆర్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (33), రియాన్ పరాగ్ (25), యశస్వి జైస్వాల్ (29)లు రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీ లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం క్వింటన్ డికాక్ (97 నాటౌట్; 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యాన్ని కేకేఆర్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. ఆర్ఆర్ బౌలర్లలో వనిందు హసరంగ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆర్చర్ కావాలనే డికాక్ సెంచరీని అడ్డుకున్నాడా?
ఈ మ్యాచ్‌లో డికాక్ ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఆ తరువాత కాస్త వేగం పెంచాడు. 35 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక కోల్‌కతా స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి 135/2 గా ఉంది. అప్పటికి డికాక్ 58 బంతుల్లో 81 పరుగులతో ఉన్నాడు. అప్పటికి కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. ఇక డికాక్ శతకానికి 19 పరుగులు అవసరం.
Kavya Maran : కావ్యా మారన్ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలో తెలుసా?
18వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. తొలి బంతిని డికాక్ ఫోర్‌గా మలిచాడు. ఇక రెండో బంతికి ఏకంగా సిక్స్ బాదాడు. దీంతో డికాక్ స్కోరు 91 పరుగులకు చేరింది. మరో తొమ్మిది కొడితే డికాక్ సెంచరీ పూర్తి అయ్యేది. కేకేఆర్ విజయానికి ఏడు పరుగులు అవసరం. దీంతో డికాక్ ఈజీగా సెంచరీ చేస్తాడు అని అంతా భావించారు.
అయితే.. ఇక్కడ ఆర్చర్ వరుసగా రెండు బంతులను వైడ్లుగా వేశాడు. దీంతో కేకేఆర్ విజయసమీకరణం 5 పరుగులుగా మారింది. ఇక మూడో బంతికి డికాక్ సిక్స్ కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది. అయితే.. డికాక్ 97 పరుగుల వద్ద ఆగిపోయాడు.
View this post on Instagram
దీంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడు గనుక ఆ రెండు వైడ్స్ వేయకుండా ఉండి ఉంటే.. తప్పకుండా డికాక్ సెంచరీ చేసేవాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇది క్రీడాస్ఫూర్తి కాదని ఆర్చర్ పై మండిపడుతున్నారు.
Sportsman spirit/Spirit of the game was under question today due to the actions of Jofra Archer in the last over to deny QDK his well earned 100. No wonder its coming from a questionable franchise such as Rajasthan Royals. pic.twitter.com/rVa3gzp1ms
— ayan (@TheUpperCut_) March 26, 2025
That’s deliberate Wide from Archer to stop De kock from reaching century.#KKRvsRR
— Raazi (@Crick_logist) March 26, 2025
wouldve been century if archer didn’t bowl wides on purpose https://t.co/p6GXvgfGCy
— Soni Raj Singh (@SoniDreams_) March 26, 2025