Kavya Maran : కావ్యా మారన్ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలో తెలుసా?
కావ్యామారన్ తన టీమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తుంటారే అతిశయోక్తి కాదేమో.

Do you know Kavya Maran Net Worth
ఐపీఎల్‌ను ఫాలో అయ్యేవారికి కావ్యా మారన్ గురించి చెప్పాల్సిన పని లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్యా ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరు అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మ్యాచ్ చూసేటప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురైన కావ్యామారన్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు యజమాని అయిన తర్వాతే ఆమె ఎక్కువ పాపులర్ అయింది. అంతేకాదు దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ సీఈఓల్లో కూడా ఈమెకి ప్లేస్ ఉంది. తండ్రి స్థాపించిన రూ.33వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఒక్కతే వారసురాలు.
కావ్యామారన్ తన టీమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తుంటారే అతిశయోక్తి కాదేమో. ఇక కెమెరా కూడా కావ్య ఎక్కడుంటే అక్కడ ఫోకస్ పెడుతుంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ సెంచరీతో పాటు కావ్యామారన్‌కి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చాలామందికి గుర్తుండే ఉంటుంది
కావ్యా మారన్ ఆస్తులు ఎంతంటే?
చెన్నై స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్ డిగ్రీ చేసిన కావ్యా యూకే వార్విక్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ చేసింది. వ్యక్తిగతంగానే కావ్యమారన్‌కు రూ.417 కోట్ల విలువచేసే ఆస్తులున్నట్లు టాక్. సన్ టీవీ గ్రూప్ నెట్ వర్క్ పనులు ఈమే చేస్తుంది.
IPL Points Table 2025 : ఒక్కొ మ్యాచ్ ఆడిన అన్ని జట్లు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిదంటే?
క్యాన్సర్ రోగులకు సాయం చేయడం.. ప్రకృతి విపత్తుల్లో సన్ గ్రూప్ తరపున సహాయక కార్యక్రమాలు చేస్తుంటుంది. అలానే పర్సనల్‌గా కావ్య మారన్ కు కార్ల క్రేజ్ఉందంటారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లన్నీ ఈమె గ్యారేజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు కావ్యా కార్స్ కలెక్షన్స్‌లో క్వీన్ అని చెప్పాలి.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఈమె కలెక్షన్‌లో ఉంది. దాంతో పాటు 8 కోట్ల విలువచేసే లగ్జరీ సెడాన్, 4 కోట్ల రూపాయల బెంట్లీ బెంటాయ్గా ఎస్ యూవీ, రెండున్నరకోట్ల ఫెర్రారీ రోమా స్పోర్ట్స్ కార్‌తో పాటు ప్రీమియం సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ7 కూడా ఉంది. ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్ష్ 911, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా కావ్యామారన్ గ్యారేజ్‌లో ఉన్నాయి.
GT vs PBKS : శ్రేయస్ అయ్యర్ సెంచరీకి ఎందుకు సహకరించలేదంటే.. అసలు నిజం చెప్పిన శశాంక్ సింగ్..