GT vs PBKS : శ్రేయస్ అయ్యర్ సెంచరీకి ఎందుకు సహకరించలేదంటే.. అసలు నిజం చెప్పిన శశాంక్ సింగ్..
శశాంక్ సింగ్ సింగిల్ తీసి ఇచ్చి ఉంటే శ్రేయస్ సెంచరీ చేసుకునే వాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 42 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వాస్తవానికి అయ్యర్‌కు సెంచరీ చేసే అవకాశం ఉంది. పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 220/5 గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (97), శశాంక్ సింగ్ (22) పరుగులతో ఆడుతున్నారు. ఆఖరి ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పుడు శశాంగ్ సింగ్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. అతడు సింగిల్ తీసి ఇచ్చి ఉంటే శ్రేయస్ సెంచరీ చేసుకునే వాడు.
GT vs PBKS : సెంచరీని త్యాగం చేసిన శ్రేయస్ అయ్యర్.. నిజంగా నువ్వు గ్రేట్ సామీ..
కానీ.. శశాంక్ మాత్రం ఫస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టాడు. రెండో బంతికి రెండు పరుగులు తీశాడు. ఆ తరువాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు బాదాడు. ఓ వైడ్ కూడా పడడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ చూస్తున్న కొంత మంది ఫ్యాన్స్ శశాంక్ పై మండిపడ్డారు. సింగిల్ తీసిస్తే శ్రేయస్ సెంచరీ చేసుకునేవాడు కదా అని శశాంక్ సింగ్‌ను విమర్శిస్తున్నారు.
Shashank Singh said, “I was going to ask Shreyas Iyer if he needs strike, but before that he came and said ‘Shashank, don’t worry about my 100, just hit every ball’. It’s a team game, but it’s difficult to be selfless at that time, Shreyas was one. 100s in IPL don’t come easy”. pic.twitter.com/vHnFazSzp9
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2025
GT vs PBKS : గుజరాత్ టైటాన్స్ పై విజయం తరువాత.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
అయితే.. మ్యాచ్ అనంతరం దీనిపై శశాంక్ సింగ్ స్పందించాడు. శ్రేయస్ అయ్యర్ సెంచరీకి సహకరించపోవడానికి గత కారణాన్ని చెప్పాడు. వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ వద్దకి వెళ్లి తనకి స్ట్రైక్ కావాలా అని అడగాలని అనుకున్నట్లుగా చెప్పాడు. అయితే.. శ్రేయస్ అయ్యర్ తన వద్దకు వచ్చి.. ‘నా సెంచరీ గురించి ఆలోచించ వద్దు.. ప్రతి బంతిని బౌండరీ కొట్టండి. ఇది జట్టు ఆట. టీమ్ స్కోరు ముఖ్యం.’ అని శ్రేయస్ తనతో చెప్పినట్లుగా శశాంక్ వెల్లడించాడు.
ఐపీఎల్‌లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదన్నాడు. ఇలాంటి అద్భుత అవకాశం వచ్చినప్పుడు జట్టు కోసం నిస్వార్థంగా ఉండడం కష్టం అని, కానీ శ్రేయస్ చాలా గొప్పోడు అని శశాంక్ తెలిపాడు.
ఇక తాను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు శ్రేయస్ ఒక్కటే చెప్పాడని శశాంక్ అన్నాడు. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయాలని, స్వేచ్ఛగా ఆడు అని మాత్రమే అన్నాడని తెలిపారు. ‘ఇక జట్టు మెనేజ్‌మెంట్ నాకు ఎంతో అండగా నిలిచింది.. నా బలాలకు తగ్గట్లుగానే షాట్లు ఆడతాను.’ అని శశాంక్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
కాగా.. శశాంక్ సింగ్ ఆఖరి ఓవర్‌లో చేసిన పరుగులే మ్యాచ్ చివరిలో కీలకంగా మారాయి. దీంతో శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.