DC vs LSG : ఢిల్లీ పై ఓటమి.. లక్నో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు సంజీవ్ గొయెంకా క్లాస్.. వీడియో వైరల్
పంత్ తో మాట్లాడిన తరువాత సంజీవ్ గొయెంకా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.

PIC Credit @ LSG
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్.. 210 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో లక్నో భారీ విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు.
అయితే.. అశుతోష్ శర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రజ్ నిగమ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో 19.3 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు నష్టపోయి సంచలన విజయాన్ని సాధించింది. దీంతో లక్నో జట్టుకు నిరాశ తప్పలేదు.
అయితే.. మ్యాచ్ అనంతరం మైదానంలోనే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా సుదీర్ఘ సంభాషణ జరిపాడు. ఈ క్రమంలో యజమాని గొయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ పై మండిపడ్డాడనే ఊహాగానాలు వచ్చాయి. అయితే.. తాజాగా దీనిపై లక్నో సూపర్ జెయింట్స్ స్పందించింది. అది కేవలం సాధారణ సంభాషణ అని మాత్రమే తెలిపింది.
“𝐿𝑒𝑡’𝑠 𝑙𝑜𝑜𝑘 𝑎𝑡 𝑡ℎ𝑒 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒𝑠, 𝑎𝑛𝑑 𝑙𝑜𝑜𝑘 𝑓𝑜𝑟𝑤𝑎𝑟𝑑” 🙌 pic.twitter.com/AXE8XqiQCo
— Lucknow Super Giants (@LucknowIPL) March 25, 2025
పంత్ తో మాట్లాడిన తరువాత సంజీవ్ గొయెంకా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. ఫలితం నిరాశపరిచిందని చెప్పారు. అయితే.. ప్లేయర్లు అద్భుతంగా ఆడారని, ఈ మ్యాచ్ నుంచి సానుకూల అంశాలు తీసుకుని ముందుకు సాగాలని వివరించారు.
DC vs LSG : సంచలన ఇన్నింగ్స్ తరువాత అశుతోష్‌కు స్పెషల్ వీడియో కాల్.. ‘ఇది ఢిల్లీ లవ్ స్టోరీ’
‘ఈ మ్యాచ్‌లో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. పవర్ ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండింటింలో ఆడిన విధానం అద్భుతం. అవును మ్యాచ్ ఫలితం నిరాశపరిచింది. అయితే.. ఆటలో ఇలాంటివి సహజం. ఇది ఓ యువ జట్టు. సానుకూలతలపై దృష్టి సారించి ముందుకు సాగాలి. ఏప్రిల్ 27న జరిగే మ్యాచ్‌లో మెరుగైన ఫలితాలను సాధించండి.’ అని సంజీవ్ గొయెంకా అన్నారు.
ఏప్రిల్ 27న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కాగా.. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో లక్నో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం నాటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో సంజీవ్ గొయెంకా మైదానంలో వ్యవహరించిన తీరు పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణాలు అందరికి తెలిసిందే. కేఎల్ రాహుల్ లక్నో జట్టును వీడగా మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అటు లక్నో రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు మెగా వేలంలో దక్కించుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు సాధించి మంచి జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును లక్నోఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.