DC vs LSG : సంచల‌న ఇన్నింగ్స్ త‌రువాత అశుతోష్‌కు స్పెష‌ల్ వీడియో కాల్.. ‘ఇది ఢిల్లీ లవ్‌ స్టోరీ’

డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ చేసుకోవ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు అశుతోష్‌కు ఓ స్పెష‌ల్ వీడియో కాల్ వ‌చ్చింది.

DC vs LSG : సంచల‌న ఇన్నింగ్స్ త‌రువాత అశుతోష్‌కు స్పెష‌ల్ వీడియో కాల్.. ‘ఇది ఢిల్లీ లవ్‌ స్టోరీ’

pic credit @ DC

Updated On : March 25, 2025 / 11:03 AM IST

విశాఖ వేదిక‌గా సోమ‌వారం రాత్రి ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 1 వికెట్ తేడాతో గెలుపొందింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజ‌యానికి కార‌ణ‌మైన యువ ఆట‌గాడు అశుతోష్ శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఈ మ్యాచ్‌లో అశుతోష్ శ‌ర్మ కేవ‌లం 31 బంతుల్లో 66 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇక త‌న‌కు వ‌చ్చిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును త‌న గురువు, భారత మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు. ఇక ఆ త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ చేసుకోవ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు అశుతోష్‌కు ఓ స్పెష‌ల్ వీడియో కాల్ వ‌చ్చింది. అది త‌న మెంటార్ శిఖ‌ర్ ధావ‌న్ నుంచి వ‌చ్చింది. యువ ఆట‌గాడిని ధావ‌న్ అభినందించాడు.

DC vs LSG : ‘పో.. నువ్వు బ‌య‌టికి పో.. నేను ర‌నౌట్ చేసుకుంటా..’ కుల్దీప్ యాద‌వ్‌ను బ‌ల‌వంతంగా క్రీజు బ‌య‌ట‌కు నెట్టిన రిష‌బ్ పంత్.. వీడియో

‘చాలా ఆనందంగా ఉంది.. ల‌వ్ యూ పాజీ.’ అని అశుతోష్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘అశు-గబ్బర్‌.. ఇది దిల్లీ లవ్ స్టోరీ’ అని వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

గతేడాది శిఖ‌ర్ ధావ‌న్‌, అశుతోష్ శ‌ర్మ‌లు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ త‌రుపున ఆడిన సంగ‌తి తెలిసిందే. పంజాబ్ త‌రుపున కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో మెగావేలంలో రూ.3.8 కోట్ల‌కు ఢిల్లీ అశుతోష్‌ను సొంతం చేసుకుంది. ఢిల్లీ త‌రుపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజ‌యాన్ని అందించాడు. మ‌రోవైపు అంత‌ర్జాతీయ క్రికెట్‌తో ఐపీఎల్‌కు ధావ‌న్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

DC vs LSG : స్టంపౌట్ చేసే ఛాన్స్ మిస్ కావ‌డంపై స్పందించిన రిష‌బ్ పంత్..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నికోల‌స్ పూర‌న్ (75; 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ డ‌కౌట్ అయ్యాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు, కుల్దీప్ యాద‌వ్ రెండు, విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.

ఆ త‌రువాత అశుతోష్ శ‌ర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విప్ర‌జ్ నిగ‌మ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు.