DC vs LSG : ‘పో.. నువ్వు బయటికి పో.. నేను రనౌట్ చేసుకుంటా..’ కుల్దీప్ యాదవ్‌ను బలవంతంగా క్రీజు బయటకు నెట్టిన రిషబ్ పంత్.. వీడియో
రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆరు బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.
DC vs LSG : స్టంపౌట్ చేసే ఛాన్స్ మిస్ కావడంపై స్పందించిన రిషబ్ పంత్..
అనంతరం అశుతోష్ శర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రజ్ నిగమ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించడంతో లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు తీశారు.
కుల్దీప్‌తో పంత్ సరదా..
ఢిల్లీ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను రవి భిష్ణోయ్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని గూగ్లీగా వేయగా.. కుల్దీప్ యాదవ్ బంతిని కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే.. బంతి అక్కడే పడడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బంతిని అందుకున్న పంత్.. కుల్దీప్‌ను రనౌట్ చేయడానికి ప్రయత్నించాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) March 24, 2025
కుల్దీప్ క్రీజులోనే ఉన్నప్పటికి తన బ్యాలెన్స్ కోల్పోయి ముందుకు వంగాడు. అంతే.. పంత్ అతడిని బయటకు తోసి బంతితో బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే.. ఇదంతా పంత్ సరదాగానే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పో.. నువ్వు బయటిపో.. నేను రనౌట్ చేసుకుంటా.. అంటూ నెటిజన్లు సైతం సరదాగా ఈవీడియోకి కామెంట్లు చేస్తున్నారు.