DC vs LSG : ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి.. మైదానంలోకి దూసుకువచ్చిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా.. పంత్‌తో సీరియస్ డిస్కషన్..!
లక్నో ఓడిపోవడంతో క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఒక్కరిపైనే పడింది.

pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయాన్ని సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓ దశలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ గెలిచింది.
ఈ మ్యాచ్ లక్నో ఓడిపోవడంతో క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఒక్కరిపైనే పడింది. అతడు మరెవరో కాదు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు సంజీవ్ గొయెంకా క్లాస్ పీకుతున్నట్లుగా కనిపించింది. బౌండరీ లైన్ ఆవల డగౌట్‌లో రిషబ్ పంత్‌ను గొయెంకా ప్రశ్నిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sanjiv Goenka having a chat with Rishabh Pant. pic.twitter.com/6H6WTCxoVc
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
ఈ ఘటన ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన తరువాత చోటు చేసుకున్న ఘటనను గుర్తుకు తెచ్చింది. నాటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై గొయెంకా సీరియస్ అయ్యాడు. అది కూడా కెమెరాలు అన్ని చూస్తుండగానే కెప్టెన్ పై ఇలా వ్యవహరించడంపై అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. తదనంతపరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడాడు. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
రూ.27 కోట్లు పెట్టి కొంటే..
మెగావేలంలో రూ.27 కోట్ల వెచ్చించి మరీ రిషబ్ పంత్‌ను లక్నో కొనుగోలు చేసింది. అతడినే కెప్టెన్‌గా నియమించింది. అయితే.. తొలి మ్యాచ్‌లో పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్‌గా ఆఖరి ఓవర్‌లో సువర్ణావకాశాన్ని చేజార్చాడు. మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే ఛాన్స్‌ను పంత్ మిస్ చేశాడు. ఒకవేళ పంత్ గనుక స్టంపౌట్ చేసి ఉంటే లక్నో గెలిచి ఉండేది. ఎందుకంటే అదే ఢిల్లీకి ఆఖరి వికెట్.
DC vs LSG : ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవడం పై స్పందించిన రిషబ్ పంత్..
Goenka deserves every bit of this for treating my man KL Rahul so badly last IPL 🤣🤣🤣🙏🙏🙏 pic.twitter.com/I3Fno4aGT1
— Krishna Lahoti (@avgphoenixguy) March 24, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్ శర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రజ్ నిగమ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.