DC vs LSG : ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై స్పందించిన రిష‌బ్ పంత్..

ఢిల్లీతో ఈజీగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై రిష‌బ్ పంత్ స్పందించాడు.

DC vs LSG : ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై స్పందించిన రిష‌బ్ పంత్..

Courtesy BCCI

Updated On : April 9, 2025 / 4:41 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మూడు ఏకప‌క్ష మ్యాచ్‌ల త‌రువాత విశాఖ‌ప‌ట్నంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఏ మాత్రం ఆశ‌ల్లేని స్థితిలో పెద్ద‌గా పేరు తెలియ‌ని అశుతోష్ శ‌ర్మ‌, విప్రాజ్ నిగ‌మ్‌లు సంచ‌ల‌న బ్యాటింగ్‌తో ఢిల్లీకి మ‌రుపురాని విజ‌యాన్ని అందించారు. ఇంకోవైపు భారీ తేడాతో గెలుస్తామ‌నుకున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేజేతులా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓట‌మి పై ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ స్పందించాడు. ఒత్తిడికి గురి అయ్యామ‌ని, ఈ ఓట‌మి నుంచి గుణ‌పాఠం నేర్చుకుంటామ‌ని చెప్పాడు.

‘మా టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు చాలా బాగా ఆడారు. ఈ వికెట్ పై మేము చేసిన స్కోరు స‌రిపోతుంద‌ని భావించాను. ఇక ఓ జ‌ట్టుగా మేం ప్ర‌తి మ్యాచ్ నుంచి సానుకూల అంశాల‌ను తీసుకోవాల‌ని చూస్తున్నాము.’ అని పంత్ అన్నాడు. త‌ప్పిదాల నుంచి గుణ‌పాఠం నేర్చుకుంటామ‌ని చెప్పాడు. బేసిక్స్ త‌గ్గ‌ట్లుగా ఆడితేనే టీమ్ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌న్నాడు.

IPL 2025: పంత్ ఎంత పనిచేశావయ్యా..! అలా జరిగిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది..

‘ఇక ఆరంభంలో ఢిల్లీ వికెట్లు తీసాము. అయిన‌ప్ప‌టికి ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయ‌డం సులువు అని మాకు తెలుసు. రెండు కీల‌క భాగ‌స్వామ్యాలు ఢిల్లీకి ద‌క్కాయి. స్ట‌బ్స్, అశుతోష్ పాటు మ‌రో ఆట‌గాడు విప్ర‌జ్ నిగ‌మ్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా నిగ‌మ్ అద్భుత బ్యాటింగ్‌తో మా విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీశాడు. అని’ పంత్ చెప్పుకొచ్చాడు.

‘స్కోరు బోర్డు పై కావాల్సిన‌న్ని ప‌రుగులు ఉన్నాయి. అయితే.. బౌల‌ర్లు ఒత్తిడికి గురి అయ్యారు. ఓ జ‌ట్టుగా మేము ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి అదృష్టం కూడా క‌లిసి వ‌చ్చింది. మోహిత్ శ‌ర్మ‌ను స్టంపౌట్ చేసే అవ‌కాశం చేజారింది. అయితే ఆట‌లో ఇవ‌న్నీ స‌హ‌జం. వీటిపై దృష్టి పెట్ట‌కుంటా.. మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. ఈ మ్యాచ్‌లో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి.’ అని రిష‌బ్ పంత్ తెలిపాడు.

CSK vs MI : CSK కి వెన్నుపోటు.. సొంత బ్రదర్ దీపక్ చాహర్ మీద సోదరి సంచలనం.. కట్టప్ప పోస్టర్ పెట్టి..

ఈ మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో మోహిత్ శ‌ర్మ‌ను స్టంపౌట్ చేసే అవ‌కాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఒక‌వేళ పంత్ మోహిత్‌ను స్టంపౌట్ చేసి ఉంటే.. ఢిల్లీ ఆలౌటై ఉండేది. అప్పుడు ల‌క్నో మ్యాచ్ గెలిచేది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో ల‌క్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అశుతోష్ శ‌ర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విప్ర‌జ్ నిగ‌మ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.