IPL 2025: పంత్ ఎంతపని చేశావయ్యా..! అలా జరిగిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది..

ఐపీఎల్ -2025లో భాగంగా విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

IPL 2025: పంత్ ఎంతపని చేశావయ్యా..! అలా జరిగిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది..

Courtesy BCCI

Updated On : March 25, 2025 / 7:46 AM IST

IPL 2025 DC vs LSG: ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం రాత్రి విశాఖ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు తలపడ్డాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో ఢిల్లీ విజయబావుటా ఎగురవేసింది. అయితే, చివరి ఓవర్లలో లక్నో కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు అవకాశాలను చేజార్చుకోవటంతో ఆ జట్టు ఓడిపోవటానికి కారణమైందన్న వాదన వినిపిస్తుంది.

Also Read: IPL 2025: వాటే మ్యాచ్..! లక్నోపై ఢిల్లీ సంచలన విజయం.. చెలరేగిన శర్మ..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్స్ (72), నికోలస్ పూరన్ (75) దూకుడుగా ఆడటంతో జట్టు స్కోర్ రెండు వందల పరుగులు దాటింది. అయితే, ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన రిషబ్ పంత్ మాత్రం డకౌట్ అయ్యాడు. భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ (22), డూప్లెసిస్(29), ట్రిస్టాన్ స్టబ్స్ (34) కూడా స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. చివరిలో విప్రాజ్ నిగమ్ (15బంతుల్లోనే 39 పరుగులు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయి బౌండరీలతో విరుచుకుపడుతున్న అశుతోష్ శర్మ (66నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Also Read: Nitish Kumar Reddy : మ్యాచ్ మ‌ధ్య‌లో పెళ్లి పై స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైర‌ల్‌..

రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో అశుతోష్ శర్మ 6, 4, 6 కొట్టడంతో ఢిల్లీ విజయానికి 12బంతుల్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, 19వ ఓవర్లో మొదటి బంతిని కుల్దీప్ ఫోర్ కొట్టాడు. రెండో బంతి మిస్ అయ్యి కీపర్ రిషబ్ పంత్ చేతిలోకి చేరింది. ఈలోపే అశుతోష్ పరుగుతీశాడు. పంత్ త్రో వేసినప్పటికీ బంతి వికెట్లను తాకలేదు. వెంటనే ఆ బంతిని అందుకున్న బౌలర్ మరోవైపు వికెట్లకు త్రో వేయడంతో కుల్దీప్ రనౌట్ అయ్యాడు. పంత్ విసిరిన బాల్ వికెట్లకు తగిలి ఉండిఉంటే లక్నో విజయం దాదాపు ఖరారయ్యేది. 19వ ఓవర్లో చివరి రెండు బంతులను అశుతోష్ 6, 4గా మలచడంతో ఆఖరి ఓవర్లో ఆరు పరుగులే చేయాల్సి వచ్చింది.

 

 

లక్నో బౌలర్ షాబాజ్ 20వ ఓవర్ వేయగా.. తొలి బంతికి స్టపింగ్ అవకాశాన్ని పంత్ చేజార్చాడు. మోహిత్ శర్మ ముందుకెళ్లి ఆడగా బాల్ మిస్ అయ్యి వెనక్కు వెళ్లింది. ఆ బాల్ పంత్ చేతికి దొరికిఉండిఉంటే లక్నో విజేతగా నిలిచిఉండేది. ఆ తరువాత రెండో బంతికి మోహిత్ సింగిల్ తీశాడు. మూడో బంతికి అశుతోష్ శర్మ స్ట్రెయిట్ సిక్సర్ కొట్టడంతో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ జట్టు విజేతగా నిలిచింది.