Nitish Kumar Reddy : మ్యాచ్ మధ్యలో పెళ్లి పై స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్..
ఓ వైపు సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుండగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన పెళ్లిపై స్పందించాడు.

fans asking to nitish kumar reddy love marriage or arranged marriage video viral
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుండగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన పెళ్లిపై స్పందించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడు స్టాండ్‌లో ఉన్న కొంత మంది అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు ఇస్తూనే.. నితీశ్ రెడ్డి పెళ్లి గురించి అడిగారు. మ్యారేజ్ ఎప్పుడు బ్రో అంటూ అరిచారు.
Rohit Sharma : చెన్నైతో మ్యాచ్ ఓడిపోయినా.. రోహిత్ శర్మ ఖాతాలో రెండు రికార్డులు..
Bro Marriage eppudu bro 😭😂#NitishKumarReddy pic.twitter.com/pUmbDM44Ez
— Movies4u Official (@Movies4u_Officl) March 24, 2025
లవ్ మ్యారేజా అని అడిగారు. దీనికి నితీశ్ రెడ్డి సిగ్గుపడిపోయాడు. లవ్ మ్యారేజా అంటే కాదు అన్నట్టుగా తలూపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డి రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. 15 బంతులు ఎదుర్కొన్న అతడు 4 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 30 పరుగులు చేశాడు. బౌలింగ్ వేసే అవకాశం అతడికి రాలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (106 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో కదం తొక్కాడు. ట్రావిస్ హెడ్ (67; 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ (30; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24; 11 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తుశార్ దేశ్ పాండే మూడు వికెట్లు పడగొట్టాడు. మహేశ్ తీక్షణ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం సంజూ శాంసన్ (66; 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (70; 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), షిమ్రాన్ హెట్‌మయర్ (42; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), శుభమ్ దూబే (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినప్పటికి లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్ షమీ, ఆడమ్ జంపాలు తలా ఓ వికెట్ సాధించారు.