Rohit Sharma : చెన్నైతో మ్యాచ్ ఓడిపోయినా.. రోహిత్ శ‌ర్మ ఖాతాలో రెండు రికార్డులు..

ఆదివారం చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో రెండు రికార్డులు చేరాయి.

Rohit Sharma : చెన్నైతో మ్యాచ్ ఓడిపోయినా.. రోహిత్ శ‌ర్మ ఖాతాలో రెండు రికార్డులు..

pic Credit @ ANI

Updated On : March 24, 2025 / 2:15 PM IST

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ కు శుభారంభం ద‌క్క‌లేదు. ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికి ఓ రెండు రికార్డుల‌ను స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఇందులో ఓ చెత్త రికార్డు సైతం ఉంది.

చెన్నైతో మ్యాచ్ ఆడ‌డం ద్వారా రోహిత్ శ‌ర్మ.. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా రికార్డుకు ఎక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు దినేశ్ కార్తీక్‌ను అధిగ‌మించాడు. డీకే ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడ‌గా రోహిత్ 258 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని మాత్రమే రోహిత్ శ‌ర్మ క‌న్నా ముందు ఉన్నాడు. ధోని 265 మ్యాచ్‌లు ఆడాడు.

Ishan Kishan : నా నుంచి ఏం ఆశిస్తున్నారు? వేలం త‌రువాత జ‌రిగిన సంగ‌తి బ‌య‌ట‌పెట్టిన సెంచ‌రీ హీరో ఇషాన్ కిష‌న్‌.. ఒకే మాట చెప్పార‌ట‌..

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది వీరే..

* ఎంఎస్ ధోని – 265 మ్యాచ్‌లు
* రోహిత్ శ‌ర్మ – 258 మ్యాచ్‌లు
* దినేశ్ కార్తీక్ – 257 మ్యాచ్‌లు
* విరాట్ కోహ్లీ – 253 మ్యాచ్‌లు
* ర‌వీంద్ర జ‌డేజా – 241 మ్యాచ్‌లు
* శిఖ‌ర్ ధావ‌న్ – 222 మ్యాచ్‌లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 213 మ్యాచ్‌లు
* సురేశ్ రైనా – 205 మ్యాచ్‌లు
* రాబిన్ ఉతప్ప – 205 మ్యాచ్‌లు
* అంబ‌టి రాయుడు – 204 మ్యాచ్‌లు

ఇక చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో శివ‌మ్ దూబే క్యాచ్ అందుకోవ‌డంతో ప‌రుగులేమీ చేయ‌కుండానే హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

CSK vs MI : మ్యాచ్ ముగిశాక ముంబై ఆట‌గాడు దీప‌క్ చాహ‌ర్‌ను బ్యాట్‌తో కొట్టిన ధోని..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌, దినేశ్ కార్తీక్‌ల‌తో క‌లిసి అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఈ ముగ్గురు 18 సార్లు ఐపీఎల్‌లో ప‌రుగులు చేయ‌కుండానే ఔట్ అయ్యారు. వీరి త‌రువాత చావ్లా, న‌రైన్‌లు ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్లు అయిన ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శర్మ- 258 మ్యాచ్‌ల్లో 18 సార్లు
* గ్లెన్ మాక్స్వెల్ – 134 మ్యాచ్‌ల్లో 18 సార్లు
* దినేష్ కార్తీక్ – 257 మ్యాచ్‌ల్లో 18 సార్లు
* పీయూష్ చావ్లా – 192 మ్యాచ్‌ల్లో 16 సార్లు
* సునీల్ నరైన్ – 178 మ్యాచ్‌ల్లో 16 సార్లు
* ర‌షీద్ ఖాన్ – 121 మ్యాచ్‌ల్లో 15 సార్లు
* మ‌న్‌దీప్ సింగ్ – 111 మ్యాచ్‌ల్లో 15 సార్లు
* మ‌నీష్ పాండే – 171 మ్యాచ్‌ల్లో 14 సార్లు
* అంబ‌టి రాయుడు – 187 మ్యాచ్‌లో 14 సార్లు
* హ‌ర్భ‌జ‌న్ సింగ్ – 163 మ్యాచ్‌ల్లో 13 సార్లు