CSK vs MI : మ్యాచ్ ముగిశాక ముంబై ఆటగాడు దీపక్ చాహర్‌ను బ్యాట్‌తో కొట్టిన ధోని..
మ్యాచ్ ముగిసిన తరువాత ధోని చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

pic credit @mufaddal_vohra
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ పూర్తి అయిన తరువాత ముంబై ఆటగాడు దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాట్‌తో కొట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ (25 బంతుల్లో 31 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29 పరుగులు)లతో పాటు ఆఖరిలో దీపక్ చాహర్ (28 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53 పరుగులు) హాఫ్ సెంచరీలు చేశారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుత్తూరు మూడు, దీపక్ చాహర్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.
చాహర్‌తో ధోని ఫన్నీ మూమెంట్స్..
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. ఇక చెన్నై, ముంబైతో ముగిసిన మ్యాచ్ తరువాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోని, చాహర్‌లు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం ధోని తన చేతిలోని బ్యాట్‌తో దీపక్ చాహర్‌ను సరదాగా కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
MS Dhoni giving the bat treatment to Deepak Chahar. 🤣 pic.twitter.com/q3gHwp5qMI
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025
ఇక దీపక్ చాహర్‌తో ధోనికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సీజన్ల పాటు దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఒకరితో మరొకరి మంచి అనుబంధం ఏర్పడింది.
ఇక ఐపీఎల్ మెగా వేలంలో అతడిని ముంబై 9.25 కోట్లకు కొనుగోలు చేసింది.