CSK vs MI : ముంబై పై విజయం తరువాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ కామెంట్స్.. ధోని అభిమానులకు గుడ్‌న్యూస్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో శుభారంభం చేయడం పై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందం వ్యక్తం చేశాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గెలవడంతో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, సీఎస్‌కే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. చెపాక్ పిచ్ పై ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు.
IPL 2025 : ముంబై ఓటమికి ప్రధాన కారణాలివే.. విఘ్నేశ్‌ను ఆపేసి సూర్యకుమార్ పెద్ద తప్పు చేశాడా..?
పేసర్ ఖలీల్ అహ్మద్ సీనియర్ ప్లేయర్ అని, అతడికి చాలా అనుభవం ఉందన్నాడు. ఇక నూర్ అహ్మద్ ఎప్పుడు తమ జట్టులో కీలక ఆటగాడు అని చెప్పాడు. అశ్విన్ లాంటి ఆటగాడు జట్టులో ఉండడం జట్టుకు ఎంతో గొప్ప ప్రయోజనం అని తెలిపాడు.
ఇక తాను ఓపెనింగ్ కాకుండా మూడో స్థానంలో బరిలోకి దిగడం పై స్పందిస్తూ.. ఆటలో ఇలాంటివి అన్ని సహజమే అని చెప్పాడు. తాను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల జట్టుకు సమతుల్యత వస్తుందని చెప్పాడు. అందుకనే తన స్థానాన్ని మార్చుకోవడం జరిగిందని, అయినప్పటికి తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు రుతురాజ్ వివరించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ధోని చేసిన మెరుపు స్టపింగ్ గురించి మాట్లాడుతూ.. ధోని ఈ ఏడాది మరింత ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. అతడు ఇంకా యువకుడిగానే కనిపిస్తున్నట్లుగా తెలిపాడు. ధోని ఫిట్‌గా ఉన్నట్లు రుతురాజ్ చెప్పడంతో తలా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధోని మెరుపు స్టంపింగ్..
ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ను సీఎస్‌కే బౌలర్ నూర్ అహ్మద్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి సూర్య భారీ షాట్ కొడదామని భావించి క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. అయితే.. అతడు బంతిని మిస్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న ధోని ఊరుకుంటాడా చెప్పండి వెంటనే బెయిల్స్‌ను పడగొట్టాడు. 0.12 సెకన్లలోనే ధోని స్టంపౌట్ చేయడం గమనార్హం. 43 ఏళ్ల వయసులో ధోని ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
MS DHONI, THE FASTEST BEHIND STUMPS 🐐 pic.twitter.com/JJhd5GOlTL
— Johns. (@CricCrazyJohns) March 23, 2025