IPL 2025 : ముంబై ఓటమికి ప్రధాన కారణాలివే.. విఘ్నేశ్‌ను ఆపేసి సూర్యకుమార్ పెద్ద తప్పు చేశాడా..?

ముంబై ఇండియన్స్ జట్టులో 11మంది ప్లేయర్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు. అయితే..

IPL 2025 : ముంబై ఓటమికి ప్రధాన కారణాలివే.. విఘ్నేశ్‌ను ఆపేసి సూర్యకుమార్ పెద్ద తప్పు చేశాడా..?

Courtesy BCCI

Updated On : March 24, 2025 / 7:42 AM IST

IPL 2025 : ఐపీఎల్-2025 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సీఎస్‌కే జట్టు విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

Also Read: IPL 2025: అట్లుంటది మరీ.. రోహిత్ శర్మ మరో మైలురాయి.. హిట్ మ్యాన్ రికార్డు

ముంబై జట్టు ఓడిపోవటానికి ప్రధాన కారణాలున్నాయి. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం లభించలేదు. రోహిత్ శర్మ డకౌట్ రూపంలో పెవిలియన్ కు తిరిగి వెళ్లాడు. ఖలీల్ అహ్మద్ రోహిత్ ను ఔట్ చేశాడు. ఆ తరువాత మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 13 పరుగులకే ఔటయ్యాడు. ఆ జట్టులో బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు చేశాడు. చివరికి దీపక్ చాహర్ 28 పరుగులు చేయడం వల్లే జట్టు 150 పరుగులు దాటింది. లేకుంటే 130 పరుగులకే ముంబై జట్టు ఆలౌట్ అయ్యుండేది.

Also Read: Cummins: “ఇది భయానకం” అంటూ రాజస్థాన్‌పై గెలుపు తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌ ఆసక్తికర కామెంట్లు

బౌలింగ్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పిన్నర్ విఘ్నేుశ్ పుత్తూర్ బౌలింగ్ కు బ్రేక్ ఇచ్చి పెద్దతప్పు చేశాడన్న అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విఘ్నేశ్ పుత్తూర్ తన అరంగ్రేట మ్యాచ్ లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ (56)ను ఔట్ చేశాడు. ఆ తరువాత శివం దూబే (9)ని ఔట్ చేసి మళ్లీ ముంబై జట్టులో విజయంపై ఆశలు చిగురింపజేశాడు. ఆ తరువాత దీపక్ హుడా రూపంలో మూడో వికెట్ తీసుకున్నాడు. విఘ్నేశ్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ విఘ్నేశ్ బౌలింగ్ ను కంటిన్యూ చేసి ఉండిఉంటే బాగుండేది. ఆ సమయంలో విఘ్నేశ్ మంచి జోరుమీదున్నాడు. అతని నాల్గో ఓవర్ ను వేయడం ద్వారా వికెట్ తీసిఉండిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ, సూర్యకుమార్ యాదవ్ విఘ్నేశ్ కు వరుసగా ఫోర్త్ ఓవర్ ఇవ్వకుండా పక్కన పెట్టాడు. చివరిలో అతనికి అవకాశం ఇచ్చిన ఉపయోగం లేకుండా పోయింది. విఘ్నేశ్ పుతూర్ తన నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

 

ముంబై ఇండియన్స్ జట్టులో ఆడిన 11మంది ప్లేయర్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పరుగులు రాబట్టడంలో, సీఎస్కే బ్యాటర్లను త్వరగా ఔట్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. ర్యాన్ రికెల్టన్ 13, విల్ జాక్స్ 11 పరుగులు మాత్రమే చేశారు. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ మూడు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చాడు. అతను కూడా ఒక్క వికెటల్ కూడా తీయలేదు. విల్ జాక్స్ నాలుగు ఓవర్లు వేసి 32 పరుగులకు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అతను కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు.