IPL Points Table 2025 : ఒక్కొ మ్యాచ్ ఆడిన అన్ని జట్లు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిదంటే?
ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు అన్ని జట్లు ఈ టోర్నమెంట్‌లో ఒక్కొ మ్యాచ్‌ను ఆడాయి.

pic credit @ipl twitter
ఐపీఎల్ 2025లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని జట్లు ఈ టోర్నమెంట్‌లో ఒక్కొ మ్యాచ్‌ను ఆడాయి. ఐదు జట్లు శుభారంభాలను అందుకోగా, మరో ఐదు జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ఇక బ్యాటర్లు అయితే దూకుడుగా ఆడుతున్నారు. బంతి పడడమే ఆలస్యం బౌండరీలే లక్ష్యంగా చితక్కొట్టుడు కొడుతున్నారు. అలాగని బౌలర్లు తక్కువ ఏమీ కాదు.. అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌లను మలుపుతిప్పుతున్నారు.
ఇదిలా ఉంటే.. 5 జట్లు ఒక్కొ మ్యాచ్‌లో గెలవడంతో ఆయా జట్ల ఖాతాలో తలా రెండు పాయింట్లు ఉన్నాయి. అయినప్పటికి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఇందుకు ఆ జట్టు నెట్‌రన్‌రేట్ ప్రధాన కారణం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును సాధించిన ఆ జట్టు 44 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ +2.200గా ఉంది.

pic credit @ipl twitter
ఇక రెండో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి మరో 22 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. దీంతో బెంగళూరు నెట్‌రన్‌రేట్ +2.137గా ఉంది. ఆ తరువాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్, చెన్నైసూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.
ఇక ఈ టోర్నీని ఓటములతో ప్రారంభించిన లక్నోసూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతానైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.
కాగా.. లీగ్ షెడ్యూల్ పూర్తి అయ్యే నాటికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. క్వాలిఫయర్ 1లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-2 జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
GT vs PBKS : శ్రేయస్ అయ్యర్ సెంచరీకి ఎందుకు సహకరించలేదంటే.. అసలు నిజం చెప్పిన శశాంక్ సింగ్..
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టును ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో క్వాలిఫయర్ 1 విజేతతో కప్పు కోసం పోటీపడనుంది.