GT vs PBKS : మాక్స్‌వెల్ ఆ విష‌యాన్ని మ‌రిచిపోయావా..? చూడు ఇప్పుడు ఏమైందో.. పాంటింగ్ రియాక్ష‌న్ చూశావా?

గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో మాక్సీ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు.

GT vs PBKS : మాక్స్‌వెల్ ఆ విష‌యాన్ని మ‌రిచిపోయావా..? చూడు ఇప్పుడు ఏమైందో.. పాంటింగ్ రియాక్ష‌న్ చూశావా?

Courtesy BCCI

Updated On : March 26, 2025 / 9:39 AM IST

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2025లోనూ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గ‌త కొన్నేళ్ల పాటు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కు ప్రాతినిథ్యం వ‌హించిన ఈ ఆట‌గాడిని మెగా వేలానికి ఆర్‌సీబీ విడిచిపెట్టింది. మెగా వేలం 2025లో మాక్సీని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అత‌డిపై పంజాబ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

అయితే.. గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో మాక్సీ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. గోల్డెన్ డ‌కౌట్‌గా అయ్యాడు. ఆడిన తొలి బంతికే ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. గుజ‌రాత్ బౌల‌ర్ సాయి కిషోర్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును త‌న పేరిట న‌మోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మాక్స్ వెల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 19 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

GT vs PBKS : సెంచ‌రీని త్యాగం చేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. నిజంగా నువ్వు గ్రేట్ సామీ..

డీఆర్ఎస్ తీసుకుని ఉంటే..

వాస్త‌వానికి మాక్స్ వెల్ గ‌నుక డీఆర్ఎస్ తీసుకుని ఉంటే నాటౌట్‌గా నిలిచేవాడు. సాయి కిషోర్ బౌలింగ్‌లో మాక్సీ రివ‌ర్స్ స్వీప్‌కు య‌త్నించ‌గా బాల్ న‌డుము వ‌ద్ద తాకింది. దీంతో ఎల్బీడ‌బ్ల్యూ అంటూ గుజ‌రాత్ ఆట‌గాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ ఔట్ అని ప్ర‌క‌టించాడు.

వెంట‌నే మాక్స్ వెల్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు వెపుకు న‌డుచుకుంటూ వెళ్లాడు. క‌నీసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తో క‌నీసం చ‌ర్చించ‌కుండానే వెళ్లిపోయాడు. ఇక రిప్లైలో బంతి వికెట్ల‌ను తాక‌లేద‌ని, వికెట్ల కంటే ఎత్తు ఎక్కుగా వెళ్లిన‌ట్లుగా క‌నిపించింది. డీఆర్ఎస్ తీసుకుని ఉంటే మాక్సీ ఔట్ అయ్యేవాడు కాదు..

GT vs PBKS : శ్రేయ‌స్ అయ్యర్ సెంచ‌రీకి ఎందుకు స‌హ‌క‌రించ‌లేదంటే.. అస‌లు నిజం చెప్పిన శ‌శాంక్ సింగ్..

కాగా.. దీన్ని డ‌గౌట్‌లో నుంచి చూసిన కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు.

GT vs PBKS : గుజ‌రాత్ టైటాన్స్ పై విజ‌యం త‌రువాత.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్లు అయిన ఆట‌గాళ్లు వీరే..

* గ్లెన్ మాక్స్వెల్ – 19 సార్లు
*రోహిత్ శర్మ- 18 సార్లు
* దినేష్ కార్తీక్ – 18 సార్లు
* పీయూష్ చావ్లా – 16 సార్లు
* సునీల్ నరైన్ – 16 సార్లు
* ర‌షీద్ ఖాన్ – 15 సార్లు
* మ‌న్‌దీప్ సింగ్ – 15 సార్లు
* మ‌నీష్ పాండే – 14 సార్లు
* అంబ‌టి రాయుడు – 14 సార్లు
* హ‌ర్భ‌జ‌న్ సింగ్ – 13 సార్లు