Mohammed Siraj : రోహిత్ శర్మకు అంతా తెలుసు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాను.. సిరాజ్ కామెంట్స్ వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో తాను లేకపోవడాన్ని ఆరంభంలో జీర్ణించుకోలేకపోయానని పేసర్ మహమ్మద్ సిరాజ్ చెప్పాడు.

Courtesy BCCI
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి దాదాపు 13 సంవత్సరాల తరువాత ఈ ట్రోఫీని ముద్దాడింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో తాను లేకపోవడాన్ని ఆరంభంలో జీర్ణించుకోలేకపోయానని పేసర్ మహమ్మద్ సిరాజ్ చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ 2023, టీ20 ప్రపంచకప్ 2024లో జట్టులో భాగమైన సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. టీమ్ఇండియా మ్యాచ్‌లన్ని దుబాయ్ వేదికగానే ఆడడంతో ఐదుగురు స్పిన్నర్లతో వెళ్లాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడంతో సిరాజ్‌కు చోటు దక్కలేదు.
IPL Points Table 2025 : ఒక్కొ మ్యాచ్ ఆడిన అన్ని జట్లు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిదంటే?
ఈ విషయంపై తాజాగా సిరాజ్ స్పందించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున అరంగ్రేటం చేసే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో చాలా విషయాలను వెల్లడించాడు. టీమ్ఇండియా తరుపున ఆడడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. వాస్తవానికి ఓ క్రికెటర్‌గా ఐసీసీ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటారని చెప్పుకొచ్చాడు.
Mohammad Siraj said, “Rohit Sharma always does what is best for the team. He knew that fast bowlers won’t be used much in Dubai, so he picked spinners in the squad and won the Champions Trophy”. pic.twitter.com/9hahxjPunQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో మొదట తనకు చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లుగా సిరాజ్ తెలిపాడు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టుకు ఏది మంచి అనే విషయం బాగా తెలుసునని అన్నాడు. ‘దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. అక్కడ పేసర్ల ఎక్కువగా ప్రభావం చూపలేరు అనే విషయం హిట్‌మ్యాన్‌కు తెలుసు. ఈ క్రమంలో అతడు ఐదు స్పిన్నర్లతో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో నన్ను జట్టులోకి తీసుకోలేదు.’ అని సిరాజ్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలవడంతో ఎంతో ఆనందించినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎంపిక కాకపోవడంతో ఆ సమయాన్ని తన బౌలింగ్, ఫిట్‌నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నట్లు సిరాజ్ తెలిపాడు. సాధారణంగా వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు తాము చేసే తప్పులను గ్రహించలేరు. విరామం దొరకడంతో నా తప్పులపై దృష్టి పెట్టాను అని సిరాజ్ అన్నారు.
ఐపీఎల్‌లో గత కొన్నేళ్ల పాటు సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. మెగావేలానికి ముందు ఆర్‌సీబీ అతడిని రీటైన్ చేసుకోలేదు. గుజరాత్ టైటాన్స్ అతడిని మెగావేలంలో దక్కించుకుంది.
కాగా.. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ తరుపున ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ ఆకట్టుకోలేకపోయాడు. ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చాడు.