IPL 2025: వావ్.. సూపర్ క్యాచ్ భయ్యా.. కేకేఆర్ కీపర్‌ క్వింటన్ డికాక్ స్టన్నింగ్ క్యాచ్‌.. వీడియో వైరల్.. ప్రశంసల జల్లు

కేకేఆర్ కీపర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన క్యాచ్ తో రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపించాడు.

IPL 2025: వావ్.. సూపర్ క్యాచ్ భయ్యా.. కేకేఆర్ కీపర్‌ క్వింటన్ డికాక్ స్టన్నింగ్ క్యాచ్‌.. వీడియో వైరల్.. ప్రశంసల జల్లు

Courtesy BCCI

Updated On : March 27, 2025 / 8:04 AM IST

IPL 2025: ఐపీఎల్ -2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం అందుకుంది. గౌహతి వేదికగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బ్యాటర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.

Also Read: Kavya Maran : కావ్యా మార‌న్‌ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వార‌సురాలో తెలుసా?

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో ధ్రువ్ జెరెల్ (33) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగుల చేసి విజేతగా నిలిచింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన డికాక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సులు ఉన్నాయి.

Also Read: Mohammed Siraj : రోహిత్ శ‌ర్మ‌కు అంతా తెలుసు.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక కాక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాను.. సిరాజ్ కామెంట్స్ వైర‌ల్‌..

డికాక్ బ్యాటింగ్ లోనేకాదు.. వికెట్ కీపింగ్ లోనూ అదరగొట్టాడు. అద్భుతమైన క్యాచ్ తో రాజస్థాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ను మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని పరాగ్ భారీ సిక్స్ కొట్టాడు. ఆ తరువాత బంతిని డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వరుణ్ చక్రవర్తి పరాగ్ కు ఔట్ సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

పరాగ్ అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. పరాగ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఆ బంతి టాప్ ఎడ్జ్ తసీుకొని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనకున్న కీపర్ డికాక్ తన కీపింగ్ స్కిల్స్ ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంట‌నే క్యాచ్ కాల్ ఇచ్చాడు. బంతిని స్పష్టంగా చూసేందుకు హెల్మెట్‌ను తీసేసి మరి పరిగెత్తాడు. బంతిపైనే ఫోకస్ పెట్టి ఒడిసిపట్టుకున్నాడు. డికాక్ ఫీల్డింగ్ విన్యాసాన్ని చూసిన స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు అత‌డి వద్దకు వ‌చ్చి అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు డికాక్ ప్రదర్శించిన స్మార్ట్ వర్క్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో కీలక సమయంలో డికాక్ తెలివైన పని చేశాడు. తద్వారా అభిమానుల నుంచి గౌరవం అందుకున్నాడని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.